బ్రేకింగ్: హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఈ ఏరియాల్లో ఫుల్ ట్రాఫిక్ జామ్!

by Disha Web Desk 19 |
బ్రేకింగ్: హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఈ ఏరియాల్లో ఫుల్ ట్రాఫిక్ జామ్!
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్, పంజాగుట్ట, అమీర్ పేట్, ఎస్‌ఆర్ నగర్, బోయిన్ పల్లి, మారేడ్ పల్లి, చిలకలగూడ, సికింద్రాబాద్, బొల్లారం, బేగంపేట్, ప్యాట్నీ, అల్వాల్, తిరుమలగిరి, కూకట్ పల్లి, హైదర్ నగర్, జీడిమెట్ల ప్రాంతాల్లో భారీగా వర్షం పడుతోంది. దీంతో ఈ ఏరియాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఉరుములు, మెరుపులతో పాటు బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. అంతేకాకుండా మరికొన్ని ప్రాంతాల్లో ఆకాశం దట్టంగా మేఘావృతమై ఉంది. ఇక, భారీ వర్షం కురుస్తోండటంతో ఈ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆఫీస్‌ల నుండి ఇంటికి వెళ్లే సమయం కావడంతో ఉద్యోగులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


Next Story