హైదరాబాద్ నగరంలో పలుచోట్ల భారీ వర్షం..

by Disha Web Desk 12 |
హైదరాబాద్ నగరంలో పలుచోట్ల భారీ వర్షం..
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగరంలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొద్దిరోజులు ఎండలు మండుతున్న క్రమంలో ఈ రోజు సాయంత్రం చిరుజల్లులు కురిసాయి. అలాగే కొద్దిసేపటి నుంచి నగర వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుంది. ముఖ్యంగా జూబ్లీహిల్స్, శేర్‌లింగంపల్లీ బంజారాహిల్స్, యూసుఫ్ గూడా, ఫిల్మ్ నగర్, ఫలక్ నుమా, ఖైరతాబాద్, అమీర్ పేట్ రాజేంద్రనగర్ ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. కాగా ఈ ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.



Next Story