ఎండల ఎఫెక్ట్.. హైదరాబాద్ మెట్రో స్టేషన్లలో ఫుల్ రష్ (వీడియో)

by Disha Web Desk 4 |
ఎండల ఎఫెక్ట్.. హైదరాబాద్ మెట్రో స్టేషన్లలో ఫుల్ రష్ (వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఓవైపు మండుతున్న ఎండలు..మరోవైపు రోడ్లపై పెరుగుతున్న రద్దీతో హైదరాబాద్ మెట్రో స్టేషన్ల కిటకిటలాడుతున్నాయి. ముంబై, జపాన్ దేశాల్లో రెగ్యులర్‌గా కనిపించే దృశ్యాలు ఇప్పుడు హైదరాబాద్ మెట్రో కనిపించటం విశేషం. రోజుకు లక్షల మంది ప్రయాణికులు పోటెత్తుతున్నారు. ఈ క్రమంలోనే గురువారం అన్ని మెట్రో స్టేషన్లలో భారీ రద్దీ ఏర్పడింది. ఇసుకేస్తే రాలనంత జనంతో మెట్రో స్టేషన్లు నిండిపోయాయి.

కనీసం మెట్రో స్టేషన్లోను నిల్చోడానికి స్థలం లేని పరిస్థితి ఏర్పడింది. మెట్రోలు, మెట్రో స్టేషన్లు ఫుల్ అయ్యి.. మెట్లపై వరకు నిల్చున్నారు ప్రయాణికులు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రయాణికులు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. కాగా, రద్దీ సమయాల్లో 2 నుంచి 3 నిమిషాల మధ్య మెట్రో సర్వీసులు అందుబాటులో ఉంటాయని మెట్రో ఎండీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయినా కూడా మెట్రో స్టేషన్లో రోజురోజుకు రద్దీ పెరుగుతుండడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై మెట్రో అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చూడాలి.

Next Story