తెలంగాణ డీజీపీకి హరీశ్ రావు రిక్వెస్ట్.. ఎందుకంటే?

by Ramesh N |
తెలంగాణ డీజీపీకి హరీశ్ రావు రిక్వెస్ట్.. ఎందుకంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉమ్మడి పాలమూరులో భూ హత్య కలకలం రేపుతోంది. నారాయణ‌పేట జిల్లా ఉట్కూరు మండలంలో అందరూ చూస్తుండగానే సంజీవ్ అనే వ్యక్తిని కర్రలతో దాడి చేశారు. ఆ దాడిలో ఆ వ్యక్తి చనిపోయాడు. అయితే, దాడి చేస్తున్న సమయంలో పోలీసులకు ఫోన్ చేసిన కూడా రెస్పాండ్ కాలేదని ఆరోపణలు వచ్చాయి.

మరోవైపు ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. కాగా, ఈ ఘటనపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. ఇవాళ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా తెలంగాణ డీజీపీకి ట్యాగ్ చేశారు. వెంటనే ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి రిక్వెస్ట్ చేశారు.Next Story

Most Viewed