కాంగ్రెస్ అలా చేస్తే.. మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయను: హరీశ్ రావు

by Disha Web Desk 12 |
కాంగ్రెస్ అలా చేస్తే.. మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయను: హరీశ్ రావు
X

దిశ, సంగారెడ్డి: ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ, ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యాంరెంటీలు, 13 వాగ్దానాలు హామీలు అమలు చేయాలి. వాటిని అమలు చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమరవీరుల స్తూపం గన్ పార్క్ వద్ద ప్రమాణం చేయాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. బుధవారం జిల్లా కేంద్రమైన సంగారెడ్డి లో విలేకరుల సమావేశంలో హరీశ్ రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ ది తొండి రాజకీయం .. ఆయన చేసిన సవాలును స్వీకరిస్తున్నా ఆగస్టు 15 లోపు ఏకకాలంలో రైతు రుణమాఫీ చేసి, ఆరు గ్యారెంటీలు అమలు చేస్తే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయను నాకు పదవులు ముఖ్యం కాదు, రైతు రుణమాఫీ, ఇచ్చిన హామీలు చేయకపోతే నువ్వు నీ సీఎం పదవికి రాజీనామా చేస్తావా..? అంటూ హరీష్ రావు సవాల్ విసిరారు.

ఈ విషయాల పై ఎల్లుండి నేను అసెంబ్లీ ముందు ఉన్న అమరుల స్థూపం వద్దకు చర్చకు వస్తా..చర్చకు సీఎం రేవంత్ కూడా రావాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో రైతులకు రూ.2లక్షల రుణమాఫీ, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రూ.2500, కళ్యాణలక్ష్మీ పథకం కింద ఇచ్చే రూ.లక్ష రూపాయలతో పాటు తులం బంగారం, రైతు భరోసా కింద రైతులకు ఎకరానికి రూ.15వేలు, పంటలకు క్వింటాళ్లుకు రూ.500 బోనస్, వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు, చేయూత పథకం కింద రూ.2వేల ఫించన్ ను రూ.4 వేలకు పెంచుతామనే హామీని నెరవేర్చాలి, నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి కింద నెలకు 4,000 ఇస్తామని హామీ ఇచ్చారు. నేటి వరకు ఎవరికీ ఇవ్వలేదు.

ఐదు నెలలకు గాను, ఒక్కో నిరుద్యోగికి మీరు 20,000 బాకీ పడ్డారు. అవి ఎప్పుడు ఇస్తారని డిమాండ్ చేశారు. ఆగస్టు 15 లోపు ఏకకాలంలో రైతు రుణమాఫీ చేసి,ఆరు గ్యారెంటీలు అమలు చేస్తే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయనని, రైతు రుణమాఫీ, ఇచ్చిన హామీలు చేయకపోతే నువ్వు నీ సీఎం పదవికి రాజీనామా చేస్తావా ఈ సవాలును స్వీకరించాలని ముఖ్యమంత్రికి డిమాండ్ చేశారు. ఎల్లుండి అమరవీరుల స్థూపం వద్ద ప్రమాణం చేస్తావా నేను కూడా ప్రమాణం చేస్తానన్నారు. ఈ సమావేశంలో జహీరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్, జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ, బీఆర్ఎస్ నాయకులు మఠం బిక్షపతి, జైపాల్ రెడ్డి, పట్నం మాణిక్యం, మామిళ్ల రాజేందర్, కాసాల బుచ్చిరెడ్డి, కొండల్ రెడ్డి, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed