Harish Rao: ధాన్యం తడిస్తే.. ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటు: హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు

by Disha Web Desk 1 |
Harish Rao: ధాన్యం తడిస్తే.. ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటు: హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆకాల వర్షాలతో రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం తడిస్తే.. ప్రభుత్వం కనీసం స్పందించపోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఇవాళ ఆయన మెదక్ జిల్లా రామాయంపేట మండల పరిధిలో పర్యటించారు. ఈ తొనిగండ్లలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో తడిసిన ధ్యాన్యాన్ని ఆయన పరిశీలించి రైతులకు భరోసా కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 100 రోజుల్లో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేరుస్తామంటూ కాంగ్రెస్ మాట తప్పిందని ఆరోపించారు. ఇంకెన్నాళ్లు ఇదే తరహాలో ప్రజలను మోసం చేస్తారని ఆయన ఫైర్ అయ్యారు.

రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని అన్నారు. వృద్ధాప్య పింఛన్లు సమాయానికి ఇవ్వకపోవడం వల్ల గ్రామాల్లో చాలామంది ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కాంగ్రస్ పాలనలో కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియడం లేదని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో రైతుల ఓట్లను రాబట్టేందుకు ఏక కాలంలో రూ.2 లక్షల రుణమాఫీ అంటూ కాంగ్రెస్ ఎన్నికల ముందు కొత్త నాటకానికి తెరలేపిందని ఆరోపించారు. వరికి రూ.500 బోనస్ కాదు కదా.. మద్దతు ధర కూడా లేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చేంత వరకు బీఆర్ఎస్ పోరాటం ఆగదని హరీష్ రావు స్పష్టం చేశారు.



Next Story

Most Viewed