వడగళ్ల వాన.. పంట నష్ట పరిశీలనకు బయలుదేరిన మంత్రులు

by Disha Web Desk 6 |
వడగళ్ల వాన.. పంట నష్ట పరిశీలనకు బయలుదేరిన మంత్రులు
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. అకాల వర్షం, వడగళ్ల వానతో భారీగా పంట నష్టం జరిగింది.

సంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో రాళ్ల వాన కురిసింది. పంటలు నేల మట్టమవగా, చెట్లు విరిగిపడ్డాయి. వికారాబాద్‌ జిల్లా మర్పల్లి, మోమిన్‌పేట మండలాల్లో, సంగారెడ్డి జిల్లా కోహీర్‌, మునిపల్లి మండలాల్లో వడగండ్లు పడ్డాయి. న్యాల్‌కల్‌ మండలంలో పంటలు దెబ్బతిన్నాయి. గద్వాల మార్కెట్‌లో ధాన్యం తడిసిపోయింది. మానవపాడు మండలంలో మిర్చి తడిసిపోయింది. మరో రెండు రోజులపాటు వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. పంట నష్టాన్ని పరిశీలించేందుకు సీఎం కేసీఆర్ ఆదేశించడంతో శుక్రవారం జరిగిన పంట నష్టాన్ని పరిశీలించడానికి వికారాబాద్ జిల్లా పర్యటనకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి , విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి , వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు బయలుదేరి వెళ్లారు. పంట నష్టం పరిశీలించడంతోపాటు రైతులతో మాట్లాడి భరోసా కల్పించనున్నారు. అంత నష్టం జరిగిందని వివరాలను సైతం సీఎంకు అందజేయనున్నారు.



Next Story

Most Viewed