గృహలక్ష్మి, దళిత బంధు అర్హుల జాబితాను అప్లోడ్ చేయాలి::కలెక్టర్ శరత్

by Disha Web Desk 22 |
గృహలక్ష్మి,  దళిత బంధు అర్హుల జాబితాను అప్లోడ్ చేయాలి::కలెక్టర్ శరత్
X

దిశ, సంగారెడ్డి: గృహలక్ష్మి పథకంలో వచ్చిన దరఖాస్తులను ఆయా టీమ్స్ క్షేత్ర పరిధిలో వెరిఫికేషన్ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా. శరత్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశంలో గృహలక్ష్మి, దళిత బంధు, బీసీ మైనార్టీ బంధు, కారుణ్య నియామకాలు, జీవో 58, 59 పురోగతి, ఆయిల్ ఫాం సాగు, జీబీ భవన నిర్మాణాల పురోగతి, స్వీప్ కార్యక్రమాలు తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు వచ్చిన గృహలక్ష్మి దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో పరిశీలన పూర్తి చేయాలన్నారు. రెండవ విడత దళిత బంధుకు అర్హుల జాబితాను అప్లోడ్ చేయాలన్నారు. బీసీ కులవృత్తులకు లక్ష రూపాయల ఆర్థిక సాయం రెండో విడతలో నియోజకవర్గానికి 300 మంది లబ్ధిదారుల చొప్పున అర్హుల జాబితాలను సిద్ధం చేయాలన్నారు. ఈనెల 19న మైనార్టీలకు లక్ష రూపాయల ఆర్థిక సాయం పంపిణీకి సిద్ధం చేయాలని సూచించారు. రెండవ విడత జిల్లా లక్ష్యం మేరకు గొర్రెల పంపిణీకి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారికి సూచించారు. కారుణ్య నియామకాలను వేగవంతం చేయాలని, జీవో 58,59 వెరిఫికేషన్ పూర్తి కావాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, డిఆర్ఓ నగేష్, ఆయా శాఖల జిల్లా అధికారులు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ఈనెల 19న జిల్లాలో 5కె రన్‌ ..

భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 19న ఉదయం 6 గంటలకు జిల్లాలో ఐ ఓట్‌ ఫర్‌ షూర్‌ అనే నినాదంతో నిర్వహించనున్న 5కె రన్‌ ను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ కోరారు. సంగారెడ్డి కేంద్రంలో 19న ఉదయం 6 గంటలకు మహబూబ్ సాగర్ చెరువు వద్ద నుండి పీఎస్ఆర్ గార్డెన్స్ వరకు 5కె రన్ నిర్వహిస్తామన్నారు. ఆయా అధికారులు 5కే రన్ నిర్వహణ ఏర్పాట్లను సమన్వయంతో చేయాలని సూచించారు. 5కె రన్ కార్యక్రమంలో ఎన్నికల అధికారులు, సహాయ ఎన్నికల అధికారులు, అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు, జాప్రతినిధులు, యువత, విద్యార్దులు, ప్రజలు స్వచ్చందంగా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు.



Next Story

Most Viewed