పట్టభద్రుల MLC ఉపఎన్నిక పోలింగ్ ప్రారంభం

by Rajesh |
పట్టభద్రుల MLC ఉపఎన్నిక పోలింగ్ ప్రారంభం
X

దిశ, వెబ్‌డెస్క్: నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ ప్రారంభం అయింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. జూన్ 5న పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితాలు రానున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికైన పల్లారాజేశ్వర్ రెడ్డి రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డిలు బరిలో ఉన్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బరిలో మొత్తం 52 మంది ఉన్నారు. 3 ఉమ్మడి జిల్లాలో 34 అసెంబ్లీ స్థానాల పరిధిలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరుగుతోంది. ఎమ్మెల్సీ ఉపఎన్నిక కోసం 605 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉప ఎన్నికలో 4,63,839 మంది పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో పోలీసులు విస్తత తనిఖీలు చేపట్టారు. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో రాత్రి 8 గంటల వరకు 144 సెక్షన్ అమలులో ఉండనుంది.

Next Story

Most Viewed