బ్రేకింగ్: RTC విలీనం బిల్లుపై మరో మూడు ప్రశ్నలు లేవనెత్తిన గవర్నర్ తమిళి సై

by Disha Web Desk 19 |
బ్రేకింగ్: RTC విలీనం బిల్లుపై మరో మూడు ప్రశ్నలు లేవనెత్తిన గవర్నర్ తమిళి సై
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనానికి సంబంధించిన బిల్లు విషయంలో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. గవర్నర్ లేవనెత్తిన ప్రశ్నలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చినప్పటికీ దానితో గవర్నర్ సంతృప్తి చెందలేదు. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనానికి సంబంధించి ప్రభుత్వం పంపిన బిల్లుపై గవర్నర్ తమిళి సై మొదట ఐదు అభ్యంతరాలను వ్యక్తం చేశారు. గవర్నర్ లేవనెత్తిన ఈ ప్రశ్నలకు తెలంగాణ ప్రభుత్వం వివరణ ఇచ్చింది.

దీంతో గవర్నర్ నుండి ఈ డ్రాప్ట్ బిల్లుకు ఆమోదం వస్తుందనుకున్న క్రమంలో.. గవర్నర్ తమిళి సై మరోసారి మరికొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యొగుల విలీనం డ్రాప్ట్ బిల్లుపై తాజాగా గవర్నర్ మరో మూడు ప్రశ్నలు లేవనెత్తారు. మొత్తం ఆర్టీసీ ఆస్తులు ఎన్ని.. వాటిని ఏం చేస్తారు..? డిపోల వారీగా ఆర్టీసీ ఉద్యోగుల సంఖ్య ఎంత..? ఆర్టీసీలో పర్మినెంట్ కానీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారా..? అని ప్రభుత్వాన్ని గవర్నర్ ప్రశ్నించారు. కాగా, గవర్నర్ లేవనెత్తిన ప్రశ్నలకు జవాబిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం.

Read More..

RTC విలీనం బిల్లుకు మరికొన్ని గంటల్లో గవర్నర్ గ్రీన్ సిగ్నల్..!

Next Story

Most Viewed