ప్రశ్న పత్రాల లీకేజీపై 48 గంటలు డెడ్ లైన్.. టీఎస్పీఎస్సీకి గవర్నర్ కీలక ఆదేశం

by Disha Web Desk 19 |
ప్రశ్న పత్రాల లీకేజీపై 48 గంటలు డెడ్ లైన్.. టీఎస్పీఎస్సీకి గవర్నర్ కీలక ఆదేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీఎస్ పీఎస్సీ ప్రశ్న పత్రాల లీకేజీ ఘటనపై గవర్నర్ తమిళి సై స్పందించారు. ఈ ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని రాజ్ భవన్ 48 గంటలు డెడ్ లైన్ విధిస్తూ టీఎస్ పీఎస్సీకి లేఖ రాసింది. టీఎస్ పీఎస్సీ నిర్వహించిన, నిర్వహించాల్సిన రిక్రూట్‌మెంట్ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీని తీవ్రంగా పరిగణిస్తున్నామని, గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఆదేశాల మేరకు రాజ్ భవన్ అధికారులు మంగళవారం టీఎస్ పీఎస్సీ కార్యదర్శికి లేఖ రాసింది.

సమగ్ర విచారణకు ఆదేశించి, లీకేజీపై వివరణాత్మక నివేదికను కోరింది. అసలైన అభ్యర్థుల భవిష్యత్తు, ప్రయోజనాలను కాపాడటానికి ఇటువంటి దురదృష్ట సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలను తీసుకోవాలని ఆదేశించింది. బాధ్యులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజ్ భవన్ అధికారులు ఆ లేఖలో ఆదేశించారు. ఈ ఘటనపై 48 గంటల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని గవర్నర్ కార్యాలయం కోరింది.



Next Story

Most Viewed