ఉద్యోగులు మాత్రమే ప్రభుత్వంలోకి.. యథావిధిగా ఆర్టీసీ కార్పొరేషన్

by Disha Web Desk 2 |
ఉద్యోగులు మాత్రమే ప్రభుత్వంలోకి.. యథావిధిగా ఆర్టీసీ కార్పొరేషన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించినప్పటికీ ఆర్టీసీ కార్పొరేషన్ యథావిధిగా కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆర్టీసీ బిల్లు విషయంలో గవర్నర్ లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన వివరణలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఐదు విషయాలపై గవర్నర్ సందేహాలు వ్యక్తం చేయగా వీటిపై శనివారం ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. ఆర్టీసీ కార్మికులును మాత్రమే ప్రభుత్వంలోని తీసుకుని వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు ఇస్తామని సంస్థ మాత్రం ఎప్పటిలానే కొనసాగుతుందని తెలిపింది.

అలాగే కేంద్రం వాటా, గ్రాంట్లు, రుణాల విషయంలో నియమ నిబంధనలు అనుసరిస్తామని తెలిపింది. షెడ్యూల్ 9 ప్రకారం రూల్స్ మాటేంటని ప్రశ్నకు ఏపీ తరహాలోనే విలీనం అమలు చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. గైడ్ లైన్స్ ప్రకారం కార్మిక చట్టాలు వర్తింపచేస్తామని, జీతభత్యాల విషయంలో ఆర్టీసీని మంచి అమలు చేస్తామని బదులిచ్చింది. ప్రత్యేక ప్రణాళిక ద్వారా కండక్టర్, కంట్రోలర్లకు న్యాయం చేస్తామని తెలిపింది.

Next Story

Most Viewed