KCR ఆ పని చేసిన తర్వాతే.. నల్లగొండ గడ్డపై అడుగుపెట్టాలి: ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

by Disha Web Desk 19 |
KCR ఆ పని చేసిన తర్వాతే.. నల్లగొండ గడ్డపై అడుగుపెట్టాలి: ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఏపీ సీఎం జగన్‌తో బీఆర్ఎస్ కుమ్మక్కు అయిందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పేర్కొన్నారు. బుధవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ హాల్‌లో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ తప్పుడు ఆరోపణలు చేస్తుందన్నారు. మరోసారి సెంటిమెంట్ రగిల్చి రాజకీయాలు చేయాలని భావించడం సిగ్గుచేటన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో చేసిన తప్పిదాలన్నీ అసెంబ్లీలో దుమ్ముదులుపుతామన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులోని తప్పిదాలను ప్రజల ముందు ఉంచుతామన్నారు. పదేళ్లు పరిపాలించి ఓటమిని జీర్జించుకోలేక, బీఆర్ఎస్ దొంగ రాజకీయాలకు తెరలేపిందన్నారు. కాంగ్రెస్ హయంలో నాగార్జున సాగర్, శ్రీశైలం కట్టినామని, ఇప్పటికీ చెక్కు చెదరలేదన్నారు. కానీ లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం కుప్పకూలిందన్నారు. డిండి, ఎస్‌ఎల్‌బీసీ పూర్తి చేయకుండా నల్లగొండను ఎడారిగా మార్చారన్నారు. బీఆర్ఎస్ నాయకులు ముఖ్యమంత్రిని తిట్టడం దారుణమన్నారు. కేసీఆర్ రైతులకు క్షమాపణలు చెప్పి, నల్లగొండ గడ్డ మీద అడుగు పెట్టాలన్నారు. తన ఫామ్ హౌజ్‌కు నీళ్లు తెప్పించుకున్న కేసీఆర్, రాష్ట్రమంతటా నీళ్లు వచ్చాయనే భ్రమలో ఉన్నాడన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed