సాత్విక్ సూసైడ్ కేసు: ప్రభుత్వం సీరియస్

by Disha Web Desk 4 |
సాత్విక్ సూసైడ్ కేసు: ప్రభుత్వం సీరియస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ నార్సింగి‌లోని శ్రీచైతన్య కాలేజీ సిబ్బంది వేధింపులతో విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య చేసుకున్న ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. సాత్విక్ అంశంపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విచారణకు ఆదేశించారు. ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఇంటర్ బోర్డు సెక్రటరీ నవీన్ మిట్టల్‌కు మంత్రి ఆదేశించారు. విచారణలో దోషలుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుంటామని చెప్పారు.

మరో వైపు ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. వైస్‌ ప్రిన్సిపాల్‌ క్రిష్ణారెడ్డి, వార్డెన్లు నరేష్‌తో పాటు మేనేజ్‌మెంట్‌పై కేసు నమోదు చేశారు. సెక్షన్‌ 305 కింద పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. సాత్విక్ ఆత్మహత్యకు యాజమాన్యమే కారణం అని ఆరోపిస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కాలేజీ ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది.

Also Read: నార్సింగ్ శ్రీచైతన్య యాజమాన్యం పై కేసు నమోదు

Next Story