RTC విలీనం బిల్లుపై గవర్నర్‌కు ప్రభుత్వం వివరణ

by GSrikanth |
RTC విలీనం బిల్లుపై గవర్నర్‌కు ప్రభుత్వం వివరణ
X

దిశ, వెబ్‌డెస్క్: ఆర్టీసీ విలీనం బిల్లుపై గవర్నర్‌కు ప్రభుత్వం వివరణ ఇచ్చింది. తమిళి సై అడిగిన అంశాలపై క్లుప్తంగా సర్కార్ లిఖితపూర్వక సమాధానం చెప్పింది. అంతకుముందు.. ఆర్టీసీ బిల్లుపై ప్రభుత్వాన్ని గవర్నర్ తమిళి సై వివరణ కోరారు. ఐదు అంశాలపై సర్కార్‌ను వివరాలు అడిగారు. 1958 నుంచి ఆర్టీసీలో కేంద్ర గ్రాంట్లు, వాటాలు, రుణాలు, ఇతర సహాయం గురించి బిల్లులో ఎలాంటి వివరాలు లేవని గవర్నర్ ప్రశ్నించారు. రాష్ట్ర విభజన చట్టం షెడ్యూల్ ప్రకారం ఆర్టీసీ స్థితిని మార్చడంపై సమగ్ర వివరాలు బిల్లులో లేవన్నారు.

ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పరిగణిస్తామని చెబుతున్న ప్రభుత్వం.. వారి ప్రయోజనాలు ఎలా కాపాడబడతాయని గవర్నర్ ప్రశ్నించారు. అంతేగాకుండా ఆర్టీసీ కార్మికుల భద్రత, భవిష్యత్ ప్రయోజనాలపై మరిన్ని స్పష్టమైన హామీలు ఇవ్వాలని గవర్నర్ ప్రభుత్వాన్ని కోరారు. తాజాగా.. వీటిన్నింటికి రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. మరి ఈ వివరణకు గవర్నర్ సంతృప్తి చెందుతారో లేదో చూడాలి.

Read More: RTC యూనియన్ నేతలకు గవర్నర్ పిలుపు

Next Story

Most Viewed