Ration Card E-KYC : రేషన్‌కార్డుదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్..మరోసారి గడువు పొడిగింపు

by Disha Web Desk 1 |
Ration Card E-KYC  : రేషన్‌కార్డుదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్..మరోసారి గడువు పొడిగింపు
X

దిశ, వెబ్‌డెస్క్: రేషన్‌కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ-కేవైసీ చేసుకునేందుకు గడువు జనవరి 31తో ముగుస్తుండటంతో సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు ఈ-కేవైసీ గడువు తేదీని పొడగిస్తున్నట్లగా రాష్ట్ర సివిల్ సప్లయ్ శాఖ ప్రకటించింది. ఫిబ్రవరి చివరి వరకు ఈ-కేవైసీకి అవకాశం ఇస్తున్నట్లు వెల్లడించింది. ఈ నెల 31తో గడువు ముగియనుండడంతో రేషన్ షాపుల ఎదుట లబ్ధిదారులు క్యూ కడుతున్నారు.

దీంతో స్పందించిన ప్రభుత్వం మరోసారి గడువు తేదీని పెంచింది. కాగా రాష్ట్రంలో ఇప్పటివరకు 75 శాతం మంది రేషన్‌కార్డు దారులు ఈ-కేవైసీ పూర్తి చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా కేంద్రం అన్ని రాష్ట్రాల్లో ఉచిత రేషన్ అందిస్తుంది. కానీ, బోగస్‌ రేషన్‌ కార్డులను ఆధార్‌ నంబర్‌తో రేషన్‌‌కార్డుతో అనుసంధానం చేయాలని నిర్ణయించింది. దీనికి కారణాలు లేకపోలేదు, చాలా పాత కార్డుల్లో చనిపోయిన వారి పేర్లే ఉన్నాయి. దీంతో రేషన్ సరుకులు పక్కదారి పడుతున్నాయి.

వాటన్నింటికీ చెక్ పెట్టేందుకు ఈ-కేవైసీ ప్రక్రియను తెరపైకి తీసుకొచ్చారు. కుటుంబంలో చాలా మంది లబ్ధిదారులు ఉంటే, వారందరూ ఈ-కేవైసీ చేయాలి. మరోవైపు కొత్త రేషన్ కార్డుల ఆమోదానికి తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. త్వరలో విధానపరమైన నిర్ణయం తీసుకోనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత లబ్ధిదారుల విషయంలో మరింత స్పష్టత రానుంది. ఈ డేటాను కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకున్న తర్వాత కొత్త రేషన్ కార్డుల ఎన్ని అవసరమో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీనిని బట్టి కొత్త కార్డుల మంజూరు ప్రక్రియ వేగవంతం కావడంతో పాటు కార్డుల ప్రక్రియకు మార్గం సుగమం కానుంది.

Next Story

Most Viewed