‘ఉగాది రోజున ఆ కేంద్రాలకు సెలవు ఇవ్వండి’

by Disha Web Desk 4 |
‘ఉగాది రోజున ఆ కేంద్రాలకు సెలవు ఇవ్వండి’
X

దిశ, తెలంగాణ బ్యూరో : పదో తరగతి మూల్యాంకన కేంద్రాలకు ఉగాది పర్వదినం రోజున సెలవు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం బుధవారం పాఠశాల ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశంను కలిసి వినతి పత్రం సమర్పించారు. రాష్ట్ర ఎన్నికల అధికారిని కలిసి 60 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి ఎన్నికల విధుల నుండి తప్పించాలని విజ్ఞప్తి చేసారు. అలాగే దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న వారిని ఎన్నికల విధుల నుండి తప్పించాలని కోరారు. పదవ తరగతి పరీక్ష మూల్యాంకన కేంద్రాలలో ఎండలు తీవ్ర స్థాయిలో ఉండడంతో వసతులను ఏర్పాటు చేయాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. గత సంవత్సరం టిఏ, డిఏల బిల్లులను చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు హనుమంతరావు, ప్రధాన కార్యదర్శి నవాత్ సురేష్ పాల్గొన్నారు.


Next Story

Most Viewed