డబ్బులు వసూలు చేసిన వాళ్ల పేర్లివ్వండి.. ప్రజాపాలన వచ్చింది

by Disha Web Desk 5 |
డబ్బులు వసూలు చేసిన వాళ్ల పేర్లివ్వండి.. ప్రజాపాలన వచ్చింది
X

దిశ, డైనమిక్ బ్యూరో: పధకాలలో డబ్బులు తిన్న వారు ఎవరైనా సరే వారి పేర్లు ఇవ్వాలని బోరబండ కార్పోరేటర్ బాబా ఫసీయుద్దీన్ కీలక వ్యాఖ్యలు చేశారు. బోరబండలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబార్ వంటి ప్రభుత్వ పధకాలలో డబ్బులు వసూలు చేసిన వారు ఎవరైనా ఉంటే వారి పేర్లు ఇవ్వాలని సూచించారు. అవినీతి పాల్పడ్డది మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా రేవంతన్న నాయకత్వంలో తప్పకుండా చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు.

ప్రభుత్వం పథకాల పేరుతో ఇచ్చే డబ్బు ప్రజలదేనని, ప్రజల పైసలు ప్రజలకి పంచడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని నాయకులు డబ్బులు వసూలు చేసేవారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆరు గ్యారెంటీల ఫామ్ లు ఇచ్చారని, అవి ఇచ్చినప్పుడు ఎవరైనా డబ్బులు వసూలు చేశారా అని ప్రశ్నించారు. ప్రజాపాలన అంటే ఇదేనని తెలిపారు. అంతేగాక గత ప్రభుత్వంలో పథకాల పేరుతో డబ్బులు వసూలు చేసేవారని అలాంటి వాళ్ల పేర్లు ఉంటే తనకి ఇవ్వాలని, వారికి న్యాయం జరిగేలా చూస్తానని భరోసా ఇచ్చారు.


Next Story

Most Viewed