- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
‘మేక్ ఇన్ ఇండియా’ అని ఇండియా పేరును మారుస్తున్నారు.. మోడీపై రేవంత్ రెడ్డి ఫైర్
దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని మోడీపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ‘మేక్ ఇన్ ఇండియా’ అన్న మోడీ ఇండియా పేరునే మార్చేస్తున్నారని మండి పడ్డారు. ఇండియా కూటమి పేరు పలకడం ఇష్టం లేకనే దేశం పేరును మోడీ మారుస్తున్నారన్నారు. పెరిగిన ధరలు, మణిపూర్ అంశంపై మోడీ ఎక్కడా మాట్లాడలేదన్నారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న ప్రధాని మాట తప్పారన్నారు. బీజేపీ పాలనలో దేశ ప్రజల భద్రతకు ముప్పు ఏర్పడిందన్నారు. ‘విభజించు పాలించు’ విధానంతో దేశాన్ని బీజేపీ విచ్ఛిన్నం చేస్తోందన్నారు. ఏమీ చేయలేని మోడీ దేశం పేరును మారుస్తామంటున్నారని ఫైర్ అయ్యారు.
బీఆర్ఎస్, బీజేపీ కలిసి కాంగ్రెస్‌పై కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. అందుకే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో కాంగ్రెస్ సభకు అనుమతి ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ విజ్ఞప్తిని తిరస్కరించి బీజేపీకి అనుమతి ఇచ్చారన్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్, బీజేపీ కుట్ర రాజకీయాలను ప్రజలు తిప్పికొట్టాలన్నారు. ఈ నెల 17న జరిగే సోనియా గాంధీ సభకు ప్రజలు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.