ఆలయాల భూములకు జియో ట్యాగింగ్.. : మంత్రి కొండా సురేఖ

by Rajesh |
ఆలయాల భూములకు జియో ట్యాగింగ్.. : మంత్రి కొండా సురేఖ
X

దిశ, వెబ్‌డెస్క్: ఆలయాల భూములకు జియో ట్యాగింగ్ యోచనలో ఉన్నట్లు మంత్రి కొండా సురేఖ అన్నారు. హైదరాబాద్ బొగ్గుల కుంటలోని దేవాదాయ శాఖ కార్యాలయంలో మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడారు. భూముల వివరాలను ధరణిలో నమోదు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆక్రమణకు గురైన భూముల లెక్కలు తీయనున్నట్లు తెలిపారు. ఆక్రమణలకు గురైన భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామన్నారు. ఆధునిక పద్ధుతుల్లో భూ రికార్డులు నమోదు చేస్తామన్నారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ హన్మంత రావు, ఇతర కమిషనర్లు, ఈవోలు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed