డబ్ల్యూటీఐటీసీ స‌ల‌హాదారుడిగా గణ‌బతిరావ్ వీర‌మ‌న్

by Dishafeatures2 |
డబ్ల్యూటీఐటీసీ స‌ల‌హాదారుడిగా గణ‌బతిరావ్ వీర‌మ‌న్
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రపంచ తెలుగు సమాచార సాంకేతిక మండలి (డబ్ల్యూటీఐటీసీ)స‌ల‌హాదారుగా మ‌లేసియాలోని క్లాంగ్ ఎంపీ గణ‌బతిరావ్ వీర‌మ‌న్ నియామకం అయ్యారు. ఆదివారం వీరమన్ సలహాదారు బాధ్యతలను స్వీకరించారు. సుదీర్ఘకాలం రాజ‌కీయాల్లో ఉన్న గ‌ణ‌బ‌తిరావ్ ప‌క‌ట‌న్ ర‌క్యత్ లోని సెలంగ‌ర్ మ‌రియు హ‌ర‌ప‌న్ స్టేట్ అడ్మినిస్ట్రేష‌న్‌ల‌లో స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌గా సేవ‌లు అందించారు. కోటా అలం షా, కోట కెమ్యూనింగ్ నుంచి ఆయ‌నకు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది.

2022 నుంచి క్లాంగ్ నుంచి ఎంపీగా గ‌ణ‌బ‌తిరావ్‌ ప్రజాసేవలో ఉన్నారు. డబ్ల్యూటీఐటీసీ చైర్మన్ సందీప్ కుమార్ మ‌క్తాల మాట్లాడుతూ.. డబ్ల్యూటీఐటీసీని మ‌రింత‌గా విస్తరించ‌డం, ప్రభావ‌వంతంగా చేయ‌డం కోసం గ‌ణ‌బ‌తిరావ్ వీర‌మ‌న్‌ నియామ‌కం ఉప‌యోగ‌ప‌డుతుందన్నారు. డబ్ల్యూటీఐటీసీ సేవ‌ల‌ను న‌లుదిశ‌లాగా విస్తరించ‌డంతో పాటుగా ప్రముఖుల‌ను సైతం భాగ‌స్వామ్యుల‌ను చేయ‌డ‌మనే ప్రక్రియ‌కు ఈ నిర్ణయం మ‌రింత దోహ‌ద‌ప‌డ‌నుందన్నారు.



Next Story

Most Viewed