నిండా ముంచిన వడగళ్లు.. ఆదుకోవాలని ఫార్మర్స్ డిమాండ్

by Disha Web Desk 4 |
నిండా ముంచిన వడగళ్లు.. ఆదుకోవాలని ఫార్మర్స్ డిమాండ్
X

ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా శనివారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షం రైతన్నకు కడగండ్లనే మిగిల్చింది. పలు మండలాల్లో వరి నేలరాలింది. మామిడి, మొక్కజొన్న, మిర్చి, టమాట, పొద్దుతిరుగుడు వంటి తోటలు దెబ్బతిన్నాయి. జగదేవపూర్ మండలంలో ఈదురుగాలులకు కోళ్లఫాం పైకప్పు కొట్టుకుపోయింది.

సిద్దిపేట జిల్లాలో సగటున 38.7 మీ.మీ వర్షపాతం నమోదు కాగా, అత్యల్పంగా వర్గల్ మండలంలో 2.4 మీ.మీ అత్యధికంగా తొగుట మండలంలో 79.4 మీ.మీ వర్షం కురిసింది. బెజ్జంకి మండలం లక్ష్మీపూర్ గ్రామంలో నేలకొరిగిన మొక్కజొన్న పంటను ఎమ్మెల్యే రసమయి పరిశీలించి, రైతులను ఓదార్చారు. అలాగే పలు మండలాల్లో వ్యవసాయాధికారులు దెబ్బతిన్న పంటలను పరిశీలించి, రైతుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.

-దిశ నెట్ వర్క్

దిశ, కొండపాక : పిడుగుపాటుకు గురై మూడు దూడలు మృతి చెందిన ఘటన మండలంలోని దుద్దెడ గ్రామంలో చోటుచేసుకుంది. మల్లన్న సాగర్ ముంపు గ్రామం వేములగట్టులోని తలమైన వెంకట లక్ష్మీ దుద్దెడ గ్రామంలో నివాసం ఉంటుంది. పశువులను పోషిస్తూ పాడి రైతుగా జీవనోపాధి పొందుతున్నారు. వెంకటలక్ష్మి భర్త ఇటీవల మృతిచెందాడు. శనివారం రాత్రి పిడుగపాటుకు గురై వెంకట లక్ష్మీకి చెందిన మూడు దూడలు మృతి చెందాయి. పాలిచ్చే మూడు గేదెలు రేపటి నుండి ఇవ్వడం మానేస్తాయని ఆందోళన చెందుతూ తెలిపారు.

షెడ్డు కూలి రెండు ఆవులు..

దిశ, చేగుంట : అకాల వర్షాలతో మండల పరిధిలోని కర్నాల్ పల్లి గ్రామానికి చెందిన రైతులు పత్రాల సాయిరాం గౌడ్, జనగామ రామచంద్రర్ గౌడ్లు అప్పుచేసి ఆవులను పెంచుతున్నారు. శనివారం రాత్రి కురిసిన అకాల వర్షానికి షెడ్డు కూలి రెండు ఆవులు మృతి చెందాయి. మరో రెండు ఆవులకు నడుము విరిగి తీవ్ర గాయాలయ్యాయి. సుమారు రూ.లక్షా యాభై వేలు ఆస్తి నష్టం వాటిల్లిందని, బాధితులు కన్నీరు మున్నీరయ్యారు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేశారు.

రైతులను నిండా ముంచిన వడగళ్ల వాన..!

దిశ, కోహెడ : సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో శనివారం రాత్రి కురిసిన వడగళ్ల వర్షానికి వివిధ పంటలు నేలకొరిగాయి. మామిడి, పొద్దు తిరుగుడు, వరి నేలరాలింది. దీంతో రైతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.

వడగళ్ల వర్షానికి దెబ్బతిన్న పంటలు

దిశ, జగదేవపూర్: ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వర్షానికి ఉద్యానవన పంటలతోపాటు మొక్కజొన్న, వరి పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. శనివారం రాత్రి కురిసిన వడగళ్లతో మొక్కజొన్న నెలవాలగా, టమాటా, పచ్చిమిర్చి, కర్బూజా తోటలు దెబ్బతినగా, మామిడికాయలు నెలరాలాయి. సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని బస్వాపూర్, ఎల్లాయిగూడ, మునిగడప, అల్లిరాజపేట్, వెంకటాపూర్, తిమ్మాపూర్, ఇటిక్యాల గ్రామాల్లో ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వర్షం పడింది.

మండల వ్యాప్తంగా 187 ఎకరాల్లో కూరగాయ తోటలు, 118 ఎకరాల్లో మొక్కజొన్న, వరి పంట 56 ఎకరాల్లో వడగళ్ల వర్షానికి దెబ్బతిన్నట్లు మండల వ్యవసాయ అధికారి వసంతరావు తెలిపారు. వడగళ్ల వానకు పంట నష్టం జరిగిన రైతులను ఆదుకోవాలని ఆయా గ్రామాల్లో పంట దెబ్బతిన్న రైతులు కోరుతున్నారు.

పంట నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి

దిశ, కోహెడ : శనివారం అర్ధరాత్రి కురిసిన రాళ్లతో కురిసిన అకాల వర్షాలతో సిద్దిపేట జిల్లా కోహెడ మండల వ్యాప్తంగా వేలఎకరాల్లో మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, వరి, మామిడి తోటలు పండించే రైతులకు పంటనష్టం వాటిల్లింది. కోహెడ మండలం తీగలకుంటపల్లి గ్రామంలో బీజేపీ మండల అధ్యక్షుడు ఖమ్మం వేంకటేశం ,పార్టీ శ్రేణులు రైతులతో కలిసి అకాల వర్షాలతో దెబ్బతిన్న మొక్కజొన్న, పొద్దుతిరుగుడు పంటలను పరిశీలించారు.

చేతికందే పంటలను కోల్పోయి పుట్టెడు దుఖంలో ఉన్న రైతులను ఓదార్చారు. తీగలకుంటపల్లి సర్పంచ్ మ్యాకాల చంద్రశేఖర్ రెడ్డి, బిజెపి గ్రామశాఖ అధ్యక్షుడు గొట్టం తిరుపతి రెడ్డి, బిజెపి మండల ప్రధానకార్యదర్శులు పిల్లి నర్సయ్య గౌడ్, జాలిగం రమేష్, బిజెవైఎం మండల అధ్యక్షుడు కంది సత్యనారాయణ రెడ్డి, ముంజ సాగర్ గౌడ్, పార్టీ శ్రేణులు రైతులు మెతుకు మోహన్ రెడ్డి, పెరుగు సంజీవరెడ్డి, మూల రాజిరెడ్డి, కొమ్మిడి బాల్ రెడ్డి, ఏర్పుల హరీష్, మెతుకు మోహన్ రెడ్డి, ఇట్టిరెడ్డి బాల్ రెడ్డి, వట్టిపల్లి రాజేందర్ రెడ్డి, గుడిపల్లి వేణు, కరెడ్ల బాపురెడ్డి, కరెడ్ల నర్సింహారెడ్డి, దొంగల మహేందర్ రెడ్డి, కుకట్ల శ్రీశైలం, మెతుకు సంజీవరెడ్డి, మెతుకు శేఖర్ రెడ్డి, నీలం సురేందర్ రెడ్డి, తడకల సంజీవరెడ్డి, ఇట్టిరెడ్డి లక్ష్మారెడ్డి, మెతుకు ప్రవీణ్ రెడ్డి, తదితరులున్నారు.

Next Story

Most Viewed