టెట్ క్వాలిఫై అయిన వారికి ఉచితంగా డీఎస్సీ

by Mahesh |
టెట్ క్వాలిఫై అయిన వారికి ఉచితంగా డీఎస్సీ
X

దిశ, తెలంగాణ బ్యూరో : టెట్ క్వాలిఫై అయిన వారికి ఒకసారి ఉచితంగా డీఎస్సీకి దరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఫలితాలు రిలీజ్ చేసిన రోజు ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. కాగా అందుకు అనుగుణంగా వెబ్ సైట్ లో మార్పులు చేపట్టింది. రిజిస్ట్రేషన్ ఫామ్ లో టెట్ క్వాలిఫై అయిన వారికి అర్హత సాధించారా? లేదా? అనే కాలమ్ ను విద్యాశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. టెట్ హాల్ టికెట్ నెంబర్, జోర్నల్ నంబర్, ఎగ్జామ్ పేపర్ కాలమ్స్ ఫిల్ చేసి ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. వాస్తవానికి తొలుత ఉచితంగా డీఎస్సీకి దరఖాస్తు చేసుకునేందుకు విద్యాశాఖ అవకాశం కల్పించలేదు. కానీ ఈనెల 20 వరకు మాత్రమే దరఖాస్తుకు గడువు ఉండటంతో అభ్యర్థుల నుంచి ఒత్తిడి పెరగడంతో శనివారం వెబ్ సైట్ లో మార్పులు చేపట్టింది. టెట్ క్వాలిఫై అయి డీఎస్సీకి దరఖాస్తు చేసుకునే వారు ఉచితంగా అప్లై చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. కాగా డీఎస్సీ దరఖాస్తు ఈనెల 20తో ముగియనుంది. మరో ఐదు రోజులు మాత్రమే సమయం మిగిలుంది.Next Story

Most Viewed