తెలంగాణకు మరో అంతర్జాతీయ కంపెనీ.. వివరాలు వెల్లడించిన మంత్రి KTR

by Disha Web Desk 19 |
తెలంగాణకు మరో అంతర్జాతీయ కంపెనీ.. వివరాలు వెల్లడించిన మంత్రి KTR
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ మ్యానుఫ్యాక్చర్, సర్వీస్ ప్రొవైడర్ కంపెనీ అయిన హోన్ హై టెక్నాలజీ గ్రూప్ (ఫాక్స్‌కాన్‌) కంపెనీ తెలంగాణలో పెట్టుబడికి అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు గురువారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను హోన్ హై టెక్నాలజీ గ్రూప్ (ఫాక్స్‌కాన్) కంపెనీ సీఈఓ యంగ్ లియు కలిశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌తో యంగ్ లియు భేటీ అయ్యారు. ఫాక్స్‌కాన్‌ కంపెనీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నట్లు యంగ్ లియు తెలిపారు. ఈ పెట్టుబడి దాదాపు లక్షమంది యువతకు ఉపాధి కల్పన చేకూరుస్తుందని యంగ్ లియు హామీ ఇచ్చారు.

కొంగర్‌కలాన్‌లో 250 ఎకరాల్లో ఎలక్ట్రానిక్ కంపెనీని ఏర్పాటుకు ఫాక్స్‌కాన్ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా ఫాక్స్‌కాన్‌తో తెలంగాణ ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. కాగా, దక్షిణాసియా మార్కెట్లలో సెమీకండక్టర్ల తయారీని పెంచాలని ఫాక్స్‌కాన్ కంపెనీ యోచిస్తుంది. ఈ మేరకు మంగళవారం ప్రధాని మోడీని యంగ్ లియు కలిశారు. భారత్ టెక్, ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్‌ను పెంపొందించే లక్ష్యంగా వివిధ అంశాలపై చర్చించినట్లు ప్రధాని కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

Next Story

Most Viewed