పాత వృత్తిలోకి కేసీఆర్ మాజీ పీఆర్వో.. గతంలో ఆరోపణలతో పదవి నుంచి ఉద్వాసన!

by Disha Web Desk 14 |
పాత వృత్తిలోకి కేసీఆర్ మాజీ పీఆర్వో.. గతంలో ఆరోపణలతో పదవి నుంచి ఉద్వాసన!
X

దిశ, డైనమిక్ బ్యూరో: గతంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ (పీఆర్‌ఓ)పై తీవ్ర ఆరోపణలతో పీఆర్ఓ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా వ్యవహరించిన పీఆర్ఓ విజయ్‌కుమార్‌ రాజీనామా చేయడం గతంలో చర్చనీయాంశంగా మారింది. తీవ్ర స్థాయిలో ఆరోపణలు రావడంతోనే కేసీఆర్‌ ఆగ్రహానికి గురై తొలగించారని గతంలో టాక్ నడిచింది. వ్యక్తిగత కారణాలతో సీఎం పీఆర్వో పోస్టుకు రాజీనామా చేసినట్టు విజయ్‌కుమార్‌ అప్పట్లో ఫేస్‌బుక్‌ ద్వారా ప్రకటించారు.

ప్రగతి భవన్‌లో కీలక వ్యక్తిగా!

విజయ్‌కుమార్‌‌కు కేసీఆర్‌తో ఉన్న సాన్నిహిత్యంతో అప్పట్లో ప్రగతి భవన్‌లో కీలక వ్యక్తిగా ఉన్నారనే టాక్ నడిచింది. ప్రగతిభవన్‌ నుంచి రాజకీయ అంశాలపై కొందరికి లీకులు ఇచ్చేవారన్న ఆరోపణలు ఉండేవి. వివిధ న్యూస్‌ చానళ్లలో రిపోర్టర్‌గా పనిచేసిన విజయ్‌కుమార్‌.. ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో సీఎం పీఆర్వోగా నియమితుడై.. కొద్దికాలంలోనే కేసీఆర్‌కు దగ్గరయ్యారు. విజయ్‌కుమార్‌ ప్రాధాన్యత పెరిగిపోవడంతో ఆయన పలు వ్యవహారాల్లో కల్పించుకుని ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఓ ఇసుక రీచ్‌ను సైతం తన వ్యక్తులకు ఇప్పించుకున్నట్టు ఆరోపణలున్నాయి.

పాత వృత్తిలోకి

తీవ్ర ఆరోపణలు ఉన్న కారణంగా విజయ్ కుమార్‌.. కేసీఆర్ పీఆర్‌ఓ‌గా గతంలో రాజీనామా చేశారు. తాజాగా ఆయన మరోసారి పాత వృత్తిలోకి రానున్నట్లు ఫెస్‌బుక్ ద్వారా వెల్లడించారు. పదేళ్ల తర్వాత మళ్లీ జర్నలిస్ట్‌గా కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తున్నానని ప్రకటించారు. ఇవాళ ఓ న్యూస్ ఛానల్‌లో ఎడిటోరియల్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించినట్లు తెలిపారు.



Next Story

Most Viewed