రాహుల్ గాంధీ ముత్తాత నెహ్రూ బ్లడ్‌లోనే త్యాగం ఉన్నది

by Disha Web Desk 2 |
రాహుల్ గాంధీ ముత్తాత నెహ్రూ బ్లడ్‌లోనే త్యాగం ఉన్నది
X

దిశ, తెలంగాణ బ్యూరో: నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడే శ్రీరాముడి పాలన మొదలైనదని, ఇప్పుడు బీజేపీ కొత్తగా చెప్పాల్సింది ఏమిటని? కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రశ్నించారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ముత్తాత నెహ్రూ బ్లడ్‌లోనే త్యాగం ఉన్నదని వివరించారు. నెహ్రూ పాలనను తప్పు పట్టే మోడీ, అప్పుడే పుట్టి ఉండాల్సిందని ఎద్దేవా చేశారు. గాంధీ, నెహ్రూల చరిత్ర పాఠ్య పుస్తకాల్లో చేర్చేందుకు సీఎంను కలసి రిక్వెస్ట్ చేస్తానని చెప్పారు. రామాయణం, మహాభారతం చరిత్ర ఎలా ఉన్నదో? స్వాతంత్రం కోసం గాంధీ కుటుంబం పోరాడిన హిస్టరీ కూడా ఉన్నదని గుర్తు చేశారు. స్వాతంత్రం వచ్చిన తరువాత ఏకగ్రీవంగా నెహ్రు మొదటి ప్రధానిగా బాధ్యతలు తీసుకున్నారంటే, దేశం కోసం ఆయన ఏం చేశాడో సమాజానికి స్పష్టంగా తెలుసు అన్నారు.

అసలు దేశానికి ఎన్నికల వ్యవస్థ తెచ్చిందే నెహ్రూ అని గుర్తు చేశారు. కానీ బీజేపీ నేతలు ఆయన చరిత్రను తుడిచి వేసే చర్యలు చేపట్టారన్నారు. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను కట్టింది నెహ్రూ పాలనలోనే అని గుర్తు చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ లకు ఇవేమీ కనిపించవన్నారు. దేశానికి ఆహర కొరత లేకుండా కీలక మైన నిర్ణయాలు తీసుకొని ప్రజలకు మేలు చేసిన చరిత్ర కాంగ్రెస్‌ది అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్, స్పోక్స్ పర్సన్ భవానీ రెడ్డి, కమల్‌లు పాల్గొన్నారు.



Next Story

Most Viewed