KTR న్యూ లుక్ వైరల్.. అర్జెంటుగా సినిమాల్లోకి రావాంటున్న ఫ్యాన్స్!

by GSrikanth |
KTR న్యూ లుక్ వైరల్.. అర్జెంటుగా సినిమాల్లోకి రావాంటున్న ఫ్యాన్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియాలో అత్యంత యాక్టీవ్‌గా తెలుగు రాజకీయ నేతల్లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒకరు. నిత్యం సోషల్ మీడియా వేదికగా ప్రజలకు అందుబాటులో ఉంటారు. ట్విట్టర్(ఎక్స్), ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తన దృష్టికి వచ్చే సమస్యల పరిష్కారానిరికి కృషి చేస్తారు. అంతేగాకుండా.. ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను కూడా ఆయన అభిమానులకు, బీఆర్ఎస్ శ్రేణులకు తెలియజేస్తారు.

ఈ క్రమంలో ఆదివారం సెలవు దినాన న్యూ లుక్‌తో దర్శనమిచ్చారు. క్లీన్ షేవ్ చేసుకొని సరికొత్త లుక్‌తో ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. దీంతో ఆయన అభిమానులు కామెంట్లతో రెచ్చిపోతున్నారు. బాలీవుడ్ హీరోలాగా ఉన్నవంటూ కొందరు కామెంట్ పెడుతుండగా.. వెంటనే సినిమాల్లోకి వచ్చేయండి అన్న అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. బీఆర్ఎస్ తరపున అసెంబ్లీలో కీలక పాత్ర పోషిస్తున్నారు.



Next Story

Most Viewed