కాంగ్రెస్ ప్రభుత్వానికి వారి ఉసురు తగులుతుంది.. శాపం పెట్టిన కేసీఆర్

by Disha Web Desk 9 |
కాంగ్రెస్ ప్రభుత్వానికి వారి ఉసురు తగులుతుంది.. శాపం పెట్టిన కేసీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం కరీంనగర్‌, సిరిసిల్లలో ఎండిపోయిన పంటలను స్థానిక బీఆర్ఎస్ నేతలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సిరిసిల్లలో ఏర్పాటు చేసిన మీడియాతో సమావేశంలో మట్లాడుతూ.. నాలుగు నెలల్లోనే తెలంగాణ ఎడారి అయ్యిందని మండిపడ్డారు. ఇది కాలం తెచ్చిన కరువా.. కాంగ్రెస్ తెచ్చిన కరువా అన్నారు. తెలంగాణలో 20 లక్షల ఎకరాల మేర పంట ఎండిపోయిందని మండిపడ్డారు. నీటి నిర్వహణ తెలియని దద్దమ్మలు రాజ్మమేలుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు ఎండడానికి రెండో కారణం కరెంట్ కోతలన్నారు. వర్షపాతం లేదని మంత్రులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని తెలిపారు. దాదాపు 25 జిల్లాల్లో వర్షం పడాల్సిన దానికంటే ఎక్కువ పడింది అని అన్నారు. వందరోజుల్లో 200 మంది రైతులు చనిపోయారని నేను చెప్పానన్నారు. 48 గంటల్లో లిస్ట్ ఇమ్మంటే సీఎంకు 4 గంటల్లో లిస్ట్ పంపానని కేసీఆర్ పేర్కొన్నారు. పరిహారం ఇవ్వకపోతే చనిపోయిన రైతుల ఉసురు కాంగ్రెస్ ప్రభుత్వానికి తగులుతుందని శాపం పెట్టారు. ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టం, ఇక వాళ్లు తప్పించుకోలేరన్నారు. వీపు విమానం మోత మోగించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.



Next Story

Most Viewed