ప్రజలను తప్పుదోవపట్టించడానికే ఫేక్ సర్వేలు: Kalvakuntla Kavitha

by Disha Web Desk 19 |
ప్రజలను తప్పుదోవపట్టించడానికే ఫేక్ సర్వేలు: Kalvakuntla Kavitha
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజలను తప్పదోవ పట్టించడానికి అనేక ఫేక్ సర్వేలు వస్తుంటాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు. గురువారం జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ తల్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ అన్నీ అబద్ధాలు చెబుతారని, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మడం లేదని స్పష్టం చేశారు. మధ్య ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ విఫలమైందని చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి ఉత్తర ప్రదేశ్ ఎక్కడ సరితూగదని, అటువంటి రాష్ట్రాన్ని ఏలుతున్న సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించడానికి అర్హత లేదన్నారు. పోలింగ్ శాతం ఎంత ఉన్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీ గెలుపు తధ్యమని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఇప్పటికే సంబురాలు జరుపుకుంటున్నామని, గెలుపు పట్ల విశ్వాసంతో ఉన్నామన్నారు.

Read More..

రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తాం

Next Story

Most Viewed