హరీశ్ రావుకు షాక్.. సీఎంఆర్ఎఫ్ చెక్కుల్లో గోల్ మాల్ కేసులో మాజీ మంత్రి పాత పీఏ సహా నలుగురి అరెస్ట్

by Disha Web Desk 13 |
హరీశ్ రావుకు షాక్.. సీఎంఆర్ఎఫ్ చెక్కుల్లో గోల్ మాల్ కేసులో మాజీ మంత్రి పాత పీఏ సహా నలుగురి అరెస్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో:బీఆర్ఎస్ హయాంలో జరిగిన అక్రమాలు జరిగాయని మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. తాజాగా ఈ కేసులో మాజీ ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు పాత పీఏ నరేశ్ కుమార్ సహా నలుగురిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. మెదక్ జిల్లాకు చెందిన రవి నాయక్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అప్పట్లో మంత్రిగా ఉన్న హరీశ్ రావుకు పీఏగా వ్యవహరించిన జె.నరేశ్ కుమార్, కొర్లపాటి వంశీ, బాలగోని వెంకట్ గౌడ్, ఓంకార్ లను అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు ఇతరులను ఎఫ్ఐఆర్ లో నిందితులుగా చూపించారు. కాగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీలో భారీగా గోల్ మాల్ జరిగిందని అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి ఎమ్మెల్యేల సన్నిహత అనుచరులకు నియోజకవర్గాల్లో ఎలాంటి మెడికల్ బిల్లులు లేకుండానే పెద్దఎత్తున చెక్కులు అందించినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. తాజాగా ఈ కేసులో అరెస్టులు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది.

కాగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాలం ోజరిగిన పలు అక్రమాలపై ఇప్పటికే దృష్టి సారించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం తాజాగా సీఎంఆర్ఎఫ్ చెక్కుల విషయంలో దృష్టి సారించడం ఇందులో నాటి ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు మాజీ పీఏ ను అదుపులోకి తీసుకోవడం ఆసక్తిని రేపుతున్నది. దీంతో ఈ కేసు ఎలాంటి సంచలనాలకు దారి తీస్తోందో అనే చర్చ జోరుగా వినిపిస్తోంది. ఓ వైపు ఎంపీ ఎన్నికలు, మరో వైపు ఫోన్ ట్యాపింగ్ అంశాలతో హాట్ హాట్ గా ఉన్న రాష్ట్ర రాజకీయాల్లో ఈ చెక్కుల గోల్ మాల్ వ్యవహరారంలో ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయో అనేది వేచి చూడాలి.



Next Story

Most Viewed