బెట్టింగ్ భూతానికి మరో ఇంజినీరింగ్ విద్యార్థి బలి

by Mahesh |
బెట్టింగ్ భూతానికి మరో ఇంజినీరింగ్ విద్యార్థి బలి
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకు బెట్టింగ్ మాఫియా పెరిగిపోతుంది. ఈ బెట్టింగ్ భూతానికి అమాయక ప్రజలు, విద్యార్థులు బలవుతున్నారు. ఈ క్రమంలోనే మరో ఇంజనీరింగ్ విద్యార్థి బెట్టింగ్ చేసి డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఘట్కేసర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నితిన్ అనే విద్యార్థి ఘట్కేసర్‌లో ఓ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్నాడు. ఈ క్రమంలోనే కాలేజీ ఫీజు కోసం ఇంటి నుంచి పంపిన డబ్బులు బెట్టింగ్ లో పొగొట్టుకున్నాడు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన నితిన్ ఘట్‌కేసర్ దగ్గర రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో ముఖ్యంగా సోషల్ మీడియాలో కొంతమంది తమ స్వార్థం కోసం ఈ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్నారు. చేతుల్లో కట్టలకు కట్టలు డబ్బు పట్టుకుని మీరు కూడా నాలా సంపాదించాలంటే పలనా యాప్ లో బెట్టింగ్ పెడితో క్షణాల్లోనే వేలు, లక్షల్లో డబ్బులు వస్తాయని వీడియోలు చేస్తున్నారు. ఇవి చూసిన అమాయక విద్యార్థులు, ప్రజలు నిజంగానే అంతా డబ్బు వస్తుందేమోనని బెట్టింగ్ గ్రూప్‌లు, యాప్‌లలో చేరి మోసపొయి.. చివరకు తమ ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంత జరుగుతున్నప్పటికి పోలీసులు, ప్రభుత్వం బెట్టింగ్ లను ప్రమోట్ చేస్తున్న సెలబ్రేటీలు, ఇన్‌ష్టాగ్రామ్ ప్రమోటర్లపై ఎటువంటి చర్యలు తీసుకొవడం లేదని తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Next Story