విద్యాశాఖ మంత్రి కావలెను.. టీ-బీజేపీ సెటైరికల్ ట్వీట్

by Rajesh |   ( Updated:2024-06-14 12:30:07.0  )
విద్యాశాఖ మంత్రి కావలెను.. టీ-బీజేపీ సెటైరికల్ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో విద్యావ్యవస్థలో ఉన్న లోపాలను ప్రస్తావిస్తూ టీ బీజేపీ ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేసింది. పాఠశాలలు మొదలైన విద్యాశాఖ మంత్రి పత్తాలేడని ఫైర్ అయింది. సరైన పర్యవేక్షణ లేక ఉద్యోగాలు భర్తీలు కాక, ప్రాథమిక విద్యాశాఖ కుదేలవడంతో సామాన్య ప్రజానీకం ఇబ్బందులు పడుతున్నారని తెలిపింది. కాంగ్రెస్ పాలనకు ఇదే అద్దం పడుతోందని మండిపడింది. ఈ ట్వీట్‌కు తెలంగాణకు విద్యాశాఖ మంత్రి కావలెను.. అనే ఫొటోను జత చేసింది. విద్యాశాఖ మంత్రి పోస్ట్, 26 జిల్లాలకు డీఈవో పోస్టులు, డిప్యూటీ ఈవో పోస్టులు, 598 ఎంఈవో పోస్టులు, 22000 టీచర్ పోస్టులు, స్కేవెంజేర్ పోస్టులు గాడిద గుడ్డు అయ్యాయని సెటైర్లు వేసింది.

Advertisement

Next Story