ముగిసిన విచారణ.. నేరుగా కేసీఆర్ నివాసానికి MLC కవిత!

by Disha Web Desk 2 |
ముగిసిన విచారణ.. నేరుగా కేసీఆర్ నివాసానికి MLC కవిత!
X

దిశ, వెబ్‌డెస్క్: పదిన్నర గంటల సుదీర్ఘ విచారణ తర్వాత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ ఆఫీసు నుంచి బయటకొచ్చారు. సోమవారం ఉదయం పదిన్నరకు ప్రారంభమైన ఈడీ విచారణ రాత్రి 9:10 వరకు కొనసాగింది. విచారణలో కీలక ఆధారాలు రాబట్టినట్లు తెలుస్తోంది. సుమారు 10 గంటలకు పైగా విచారించిన ఈడీ.. సౌత్ గ్రూపు పాత్ర, రూ.100 కోట్ల వ్యవహారం కూపీ లాగినట్లు సమాచారం. అయితే, ఈనెల మార్చి 11న మొదటిసారి ఈ స్కామ్‌లో ఈడీ విచారణకు హాజరైన కవితను సుమారు ఎనిమిది గంటల పాటు విచారించారు. ఆమె ఫోన్‌ను ఇంటి దగ్గర నుంచి తెప్పించి మరీ స్వాధీనం చేసుకున్నారు. ఈసారి అంతకుమించి 10 గంటలకు పైగా విచారణ జరగడం బీఆర్ఎస్‌ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తోంది. కాగా, ఈడీ కార్యాలయం నుంచి నేరుగా ఢిల్లీలోని సీఎం కేసీఆర్ నివాసానికి వెళ్తున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి :

10 గంటలుగా ఈడీ విచారణ.. ఇంకా బయటకు రాని కవిత


Next Story

Most Viewed