- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- వైరల్
- పర్యాటకం
- టెక్నాలజీ
- Telugu News
- IPL2023
నేడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లోకి ఖమ్మం కీలక నేత!

దిశ బ్యూరో, ఖమ్మం: సత్తుపల్లి నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో నేడు కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయన అనుచరులు సత్తుపల్లి నియోజకవర్గం నుంచి భారీగా హైదరాబాద్ తరలివెళ్లారు. పొంగులేటి అనుచరుడైన ముద్రపడ్డ దయానంద్.. కొంతకాలంగా అంటీముట్టనట్లుగానే ఉన్నారు. కొద్దిరోజుల కిందట పొంగులేటి బీజేపీలో చేరుతారని టాక్ నడిచిన క్రమంలో ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించి పొంగులేటికి దూరంగా ఉంటున్నారు. కాంగ్రెస్‌లో చేరాలనే తన అభిప్రాయాన్ని వినిపించినా పట్టించుకోకపోవడంతో పొంగులేటిని వ్యతిరేకించినట్లు అనుచరులు చెబుతున్నారు.
ఈ మేరకు బుజ్జగింపుల పర్వం నడిచినా ససేమిరా అనడంతో పొంగులేటి సైతం సత్తుపల్లి అభ్యర్థిగా మరో వ్యక్తిని తెరమీదకు తేవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. 2014 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి సత్తుపల్లి బరిలో నిలిచి స్వల్ప తేడాతో టీడీపీ అభ్యర్థి సండ్ర వెంకట వీరయ్య చేతిలో ఓటమి పాలయ్యాడు. 2018లో కూడా సండ్ర చేతిలో ఓడిపోయాడు. మొదటినుంచీ పొంగులేటి అనుచరునిగా ముద్రపడ్డ దయానంద్ పొంగులేటి నిర్ణయంతో విభేదించి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యాడు.