కృష్ణా జలాల పంపిణీ.. నేటి నుంచి ట్రిబ్యునల్ విచారణ

by Disha Web Desk 4 |
కృష్ణా జలాల పంపిణీ.. నేటి నుంచి ట్రిబ్యునల్ విచారణ
X

దిశ, వెబ్‌డెస్క్: కృష్ణా జలాల పంపిణీపై నేటి నుంచి ట్రిబ్యునల్ విచారణ జరగనుంది. కేంద్రం ఆదేశాలతో ట్రిబ్యునల్ విచారణ చేపట్టనుంది. ఏపీ, తెలంగాణ మధ్య వాటాలను ట్రిబ్యునల్ తేల్చనుంది. ట్రిబ్యునల్ విధివిధానాలను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం వల్ల తీవ్ర నష్టం జరిగుతుందని ఏపీ ఆందోళన వ్యక్తం చేసింది. నదీ జల వివాదాల చట్టం ప్రకారం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు అదనపు బాధ్యతలు అప్పగించే అధికారం లేదు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం నీటి కేటాయింపులకు రక్షణ ఉంది. విభజన చట్టం సెక్షన్ 89(ఏ), 89 (బీ) కింద ట్రిబ్యునల్ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటిని ప్రాజెక్టుల వారీగా కేటాయించే అంశం పరిశీలనలో ఉంది.

Next Story

Most Viewed