''సాలు దొరా.. సెలవు దొరా'' మళ్లీ ప్రత్యక్షం.. కానీ ఈ సారీ..

by Disha Web Desk 19 |
సాలు దొరా.. సెలవు దొరా మళ్లీ ప్రత్యక్షం.. కానీ ఈ సారీ..
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రాజకీయ దూకుడు పెంచిన బీజేపీ స్టేట్ ఆఫీసు ఆవరణలో మళ్ళీ డిజిటల్ బోర్డును యాక్టివేట్ చేసింది.సాలు దొరా.. సెలవు దొరా.. పేరుతో ముఖ్యమంత్రి ఫోటో లేకుండా కల్వకుంట్ల కౌంట్ డౌన్ క్లాక్‌తో కూడిన డిజిటల్ డిస్‌ప్లే బోర్డును నెలకొల్పింది. రోజులు.. గంటలు.. నిమిషాలు.. సెకన్లతో కూడిన ఈ డిజిటల్ బోర్డును గతంలో ఏర్పాటు చేసినా టీఆర్ఎస్ నుంచి వచ్చిన ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకున్న పోలీసులు శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా బీజేపీ నేతలతో మాట్లాడి తీసేయించారు. ఇప్పుడు మరోసారి అది ప్రత్యక్షమైంది. సాలు దొరా.. సెలవు దొరా.. నినాదంపై కేంద్ర ఎన్నికల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసిందంటూ ఇటీవల వార్తలు వచ్చినా అది వాస్తవం కాదని తోసిపుచ్చిన బీజేపీ ఇప్పుడు ఈ బోర్డును ఏర్పాటు చేయడం విశేషం.

కార్యకర్తల కోరిక మేరకే బోర్డును ఏర్పాటు చేశామని, కానీ ఈసారి కేసీఆర్ బొమ్మను మాత్రం తొలగించామని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్రెడ్డి స్పష్టం చేశారు. కౌంట్ డౌన్ క్లాక్‌ డిజిటల్ బోర్డుపై గతంలో టీఆర్ఎస్, బీజేపీల మధ్య రాజకీయ దుమారం రేగింది. శాంతిభద్రతల కోణం నుంచి పోలీసులు, తగిన అనుమతి తీసుకోకుండా నెలకొల్పారంటూ జీహెచ్ఎంసీ ఈ బోర్డు ఏర్పాటుపై అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో బీజేపీ తన స్టేట్ ఆఫీసు ఆవరణలోని బోర్డును తొలగించింది. దాదాపు రెండు నెలల పాటు ఈ బోర్డు కనిపించలేదు. రాజకీయ నినాదం (పదజాలం)తోనే ఈ బోర్డును ఏర్పాటు చేశామని, ఎక్కడా పరుష పదజాలాన్ని వాడలేదని ప్రకాశ్రెడ్డి వ్యాఖ్యానించారు.


Next Story

Most Viewed