శివరాత్రి ఎఫెక్ట్.. కీసర ఆలయంలో భక్తులకు చుక్కలు

by Web Desk |
శివరాత్రి ఎఫెక్ట్.. కీసర ఆలయంలో భక్తులకు చుక్కలు
X

దిశ ప్రతినిధి,మేడ్చల్: మేడ్చల్ జిల్లా కీసరగుట్ట రామలింగేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు అడుగడుగునా కష్టాలు ఎదురవుతున్నాయి. పోలీసుల ఓవర్ యాక్షన్‌తో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. కీసర సర్పంచ్ నాయకపు మాధురిని సైతం అడ్డుకున్నారు. దీంతో ఆమె పోలీసుల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేసింది. కాసేపు వారితో వాగ్వాదం జరిగింది.

మరోవైపు వీఐపీల సేవలో తరిస్తున్న పోలీసులు సామాన్య భక్తులను పట్టించుకోకుండా, తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. పోలీసుల ఆంక్షలతో విసిగిపోతున్న భక్తులు జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు స్పందించి భక్తులకు ఇబ్బంది కలగకుండా చూడాలని కోరుతున్నారు.

విచ్చల విడిగా పాసులు..

ఏమీ తెలియకుండా వచ్చి డ్యూటీ పేరుతో వీఐపీ పాసులు పొంది సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న నాయకులు, అధికారులను అక్కడినుండి తొలగించాలని ప్రజలు, భక్తులు డిమాండ్ చేస్తున్నారు. విచ్చలవిడిగా వీఐపీ పాసులు తెచ్చుకోవడంతో, సామాన్య ప్రజలు బారులుతీరి దర్శనం కోసం గంటల తరబడి వేచి చూస్తున్నారు. తీవ్ర అసౌకర్యానికి గురై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎండకాలం కావడంతో మరోవైపు తాగునీరు లేక విలవిలలాడుతున్నారు. భక్తులకు తాగునీటి సౌకర్య కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.


Next Story

Most Viewed