తెలంగాణ ముందు అతిపెద్ద సవాల్: డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 19 |
తెలంగాణ ముందు అతిపెద్ద సవాల్: డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రం ఎంత ఆర్థిక లోతుల్లో ఉందో చెప్పేందుకే శ్వేతపత్రం విడుదల చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ ప్రజల భవిష్యత్ కోసం మంచి ఆలోచనలతో ముందుకు రావాలని ఈ సందర్భంగా సభ్యులను కోరారు. శ్వేతపత్రంపై చర్చ సందర్భంగా ఇవాళ అసెంబ్లీలో మాట్లాడిన భట్టి.. రాష్ట్రం ముందు అతిపెద్ద సవాల్ ఉందన్నారు. ఓ పక్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, మరో పక్క రాష్ట్ర ప్రజల ఆకాంక్ష ఉందని, వీటి మధ్య ప్రణాళికా బద్ధంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.

అభివృద్ధి ద్వారా సృష్టించబడే ఆస్తులు, వాటి ద్వారా ఏర్పడే సంపదతో ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు ఎలా అందించాలనేదానిపై ఆలోచన చేయాలన్నారు. ఏ బడ్జెట్‌లో అయినా అంచనాలకు, ఖర్చుకు గ్యాప్ ఉంటుంది. కానీ గత ప్రభుత్వం కాలంలో చాలా సార్లు 20 శాతం కంటే గ్యాప్ ఉందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వాస్తవాలకు దూరంగా బడ్జెట్‌లు రూపకల్పన చేసిందన్నారు. శ్వేతపత్రంపై చర్చలో పాల్గొన్న సభ్యులందరికి ధన్యవాదాలు తెలిపారు. ఇవాళ్టి చర్చలో సభ్యులందరూ మంచి సూచనలు చేశారన్నారు.

Next Story

Most Viewed