ఎల్‌కే అద్వానీ అంటే ప్రధాని మోడీకి అస్సలు నచ్చదు: CPI నారాయణ

by Disha Web Desk 19 |
ఎల్‌కే అద్వానీ అంటే ప్రధాని మోడీకి అస్సలు నచ్చదు: CPI నారాయణ
X

దిశ, తెలంగాణ బ్యూరో: పార్లమెంట్‌లోకి ప్రవేశించి స్మోక్ బాంబుతో భయబ్రాంతులకు గురి చేసిన సంఘటనలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా భద్రతా వైఫల్యం చెందిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు.పార్లమెంట్‌నే కాపాడలేని అసమర్ధులు భారతదేశాన్ని ఎలా కాపాడతారని ఆయన ప్రశ్నించారు. శనివారం అయన మీడియాతో మాట్లాడుతూ.. భారతదేశ చరిత్రలో ఇంత మంది ఎంపీలను సస్పెండ్ చేసిన ఘటన ఎప్పుడూ జరగలేదని బీజేపీ తీరుపై మండిపడ్డారు. పార్లమెంట్‌పై దాడి ఘటనపై సభ్యులు చర్చకు పట్టుబట్టడం తప్పా అని ప్రశ్నించారు. ఒకవేళ ఏదైనా జరిగితే సభ్యులు చనిపోయేవారు కదా..? బీజేపీ ఎంపీ పాస్ ఇవ్వడం నిజమా కాదా..? పొరపాటున ఎంఐఎం ఎంపీ ఇచ్చి ఉంటే ఏం చేసేవారు..? ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికల జిమ్మికులో భాగంగానే ప్రమాదకర గేమ్ ఆడారని ఆరోపించారు.

ఇండియా కూటమికి దేశంలో జనాధరణ పెరుగుతుంది కాబట్టి ఇలా చేస్తున్నారన్నారని అన్నారు. రామజన్మభూమి ఆలయానికి వ్యూహాత్మకంగా అందరిని పిలిచారన్నారు. బాబ్రీ మసీదు కూలగొట్టడానికి ఆద్యుడు అద్వానీ, కానీ ఆయన్ను రానివ్వడం లేదన్నారు. అద్వానీ వస్తే ఆయనకే క్రెడిట్ వెళ్తుందని భావనతో ఆయన్ని ఆహ్వానించడం లేదని.. అద్వానీ అంటే మోడీకి అసలు ఇష్టం లేదని ఆరోపించారు. అందుకే అద్వానీ, మురళీ మనోహర్ జోషికి ఆహ్వానం ఇవ్వలేదని తెలిపారు.

Next Story

Most Viewed