సీఎం హామీ ఇచ్చాడు.. గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయండి: CPI

by Disha Web Desk 2 |
సీఎం హామీ ఇచ్చాడు.. గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయండి: CPI
X

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలని విద్యార్థులు చేస్తున్న డిమాండ్ టీఎస్పీఎస్‌సీ సానుకూలంగా పరిశీలించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు శుక్రవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. గ్రూప్-2 అభ్యర్థులకు కావాల్సిన సమయం లేదని వరుసగా గురుకుల ఉపాధ్యాయులు, జూనియర్ లెక్చరర్ల నియామక పరీక్షలు వస్తుండడం, వాటి మధ్యలో గ్రూప్-2 తేదీలు రావడంపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. దీనిపై పరిశీలన చేస్తామని స్వయంగా సీఎం కేసీఆర్ ఇటీవల శాసనసభ సమావేశాలలోనే హామీ ఇచ్చారని గుర్తు చేశారు. పెద్ద ఎత్తున్న ప్రభుత్వ ఉద్యోగాలను రిక్రూట్ చేస్తున్న తరుణంలో విద్యార్థులు అవకాశం కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని కూనంనేని కోరారు.

గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ కార్యాలయం వద్ద నిరసన తెలియజేస్తున్న కారణంతో పోలీసులు అరెస్టు చేసిన విద్యార్థులు, అభ్యర్థులపై కేసులు నమోదు చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి కూనంనేని సాంబశివరావు విజ్ఞప్తి చేశారు. అరెస్టయిన వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చాలాకాలం తరువాత నియామకాలు జరుగుతున్న సమయంలో ఒకేసారి పరీక్ష జరుగుతున్న తరుణంలో విద్యార్థులలో ఆందోళనను అర్థం చేసుకోవాలని, సంఘ విద్రోహ శక్తులు కారని అన్నారు. కేసులు పెడితే విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారతుందని తెలిపారు.


Next Story

Most Viewed