దోపిడీదారులు ప్రభుత్వ సంపదను కొల్లగొడుతున్నారు.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు

by Dishafeatures2 |
దోపిడీదారులు ప్రభుత్వ సంపదను కొల్లగొడుతున్నారు.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
X

దిశ, తెలంగాణ బ్యూరో : చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా)ను రద్దు చేయాలని, తాడ్వాయిలో 152 మందిపైన నమోదు చేసిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని, అలాగే తులసిచందుపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఆమెకు పూర్తిస్థాయి రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించింది. మంగళవారం మగ్దూం భవన్ లో వామపక్ష నాయకులు, ప్రజా సంఘాల నేతలతో రౌండ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ .. దొంగలు హాయిగా ఉంటున్నారని, రేపిస్టులు, ల్యాండ్‌ మాఫియాలు, ప్రభుత్వ సంపద కొల్లగొట్టే దోపిడిదారులు రొమ్మువిరికి రోట్లపై తిరుగుతుంటే, అన్యాయాన్ని ప్రశ్నించే మేధావులు, విద్యావంతులు, దేశభక్తులు, బెయిల్‌ రాకుండా జైళ్లలో మగుతున్నారని అన్నారు. సమాజలో చీకటి నిర్భందాలు, అణచివేతలు కొనసాగుతున్నాయని మండిపడ్డారు. ప్రశ్నించేవారిని చూస్తేనే పాలకులకు భయమని, భావాన్ని, కిరణాలను బంధిస్తారా? అని మండిపడ్డారు.

ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల నే పథ్యంలో అధికారంలోనికి రావాలనుకునే రాజకీయ పార్టీ తాము అధికారంలోనికి వస్తే ‘ఉపా’ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయబోమని స్పష్టమైన హామీఇవ్వాలని, అప్పుడే ‘ఉపా’పై జరిగే చర్చలకు, రౌండ్ చర్చలకు విలువ,అర్ధం అని అన్నారు. ‘ఉపా’ చట్టం తొలగింపు అంశం ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందపర్చాలన్నారు. దుర్మార్గమైన ‘ఉపా చట్టాన్ని క్షేత్రస్థాయిలోని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, తద్వారా రాజకీయ పార్టీలను వారు నిలదీసే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు.

ఎడిటర్ కె.శ్రీనివాస్ మాట్లాడుతూ.. మిలిటెంట్ పోరాటలు, నిస్వార్థంగా పనిచేస్తున్న వారిపైన ‘ఉపా’ చట్టాలను ప్రయోగిస్తే, రాజకీయ ప్రత్యార్థులపైన ఇడి, సీబీఐ కేసులను, సామాజికరంగంలో ప్రశ్నిస్తున్న తులసిచందు లాంటి వారిపైన ట్రోలింగ్ ద్వారా దాడులు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని పరిస్థితులను పరిశీలిస్తే ప్రభుత్వ దుందుడుకు చర్యలు, ఆహాంకారానికి ప్రతీకలని అన్నారు. ‘ఉపా’ ఉపసంహరణ అంశం ఒక రాజకీయ ఏజెండగా మారాలని, వామపక్షాలు కూడాతమ మ్యానిఫెస్టోలో పొందపర్చాలని కోరారు. ప్రజల భాగస్వామ్యంతో ఏర్పడిన రాష్ట్రంలో ఉపా అమలు చేయాల్సిన అవసరం ఏముందని ప్రభుత్వాన్ని నిలదీశారు. జులై 15న సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద కళాకారులతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, అలాగే కళలు,గళాల గర్జన సభ నిర్వహిస్తామని విమలక్క తెలిపారు.

ఈ కార్యక్రమంలో చాడ వెంకట్ రెడ్డి, పల్లా వెంకట్ రెడ్డి, ఎన్.బాలమల్లేశ్, వి.ఎస్.బోస్, ఇ,టి.నర్సింహా(సిపిఐ) చెరుపల్లి సీతరాములు( సిపిఐ(ఎం)), పోటు రంగారావు( ప్రజాపంథ), సాధినేని వెంకటేశ్వర్ రావు(సిపిఐ-ఎంఎ.ల్ -న్యూడెమోక్రసి),జానకిరాములు(ఆర్ మురహరి( ఎస్ మండల వెంకన్న(సిపిఐ ఎం.ఎల్.-న్యూడెమోక్రసి), రాజేష్(సిపిఐ ఎం.ఎల్-లిబరేషన్), విమలక్క( అరుణోదయ సంస్కృతిక మండలి), ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ (పౌరహక్కులు సంఘం ), సంధ్య( పివోడబ్లు),రాజనర్సింహ(ప్రజా కళా మండలి) హాజరయ్యారు.



Next Story

Most Viewed