అమలు కాని హామీలెన్నో లెక్కతీసి.. విప్పదీసి కొట్టండి.. పొన్నం హాట్ కామెంట్స్

by Disha Web Desk 5 |
అమలు కాని హామీలెన్నో లెక్కతీసి.. విప్పదీసి కొట్టండి.. పొన్నం హాట్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: గత ప్రభుత్వంలో అమలు కాని హామీలెన్నో లెక్కతీసి.. విప్పదీసి కొట్టండి అని తెలంగాణా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హట్ కామెంట్స్ చేశారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జనజాతర పేరుతో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి 80 రోజులు గడవకముందే బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వం పడిపోతుందని శాపనార్ధాలు పెడుతున్నారని, కాంగ్రెస్ ను ముట్టే ప్రయత్నం చేస్తే, మాడి మసైపోతారని హెచ్చరించారు. గత పదేళ్లు అధికారంలో ఉండి ఇచ్చిన హామీలలో అమలు కానీ హామీలెన్నో లెక్కతీసి.. విప్పదీసి కొట్టాలని అన్నారు.

అదేవిధంగా బీజేపీ పదేళ్లు అధికారంలో ఉండి తెలంగాణకు ఏం ఇచ్చిందో లెక్క చెప్పాలన్నారు. అంతేగాక తెలంగాణ ఏర్పాటునే వ్యతిరేఖించిన బీజేపీకి తెలంగాణలో ఉండే హక్కు ఉందా అని ప్రశ్నించారు. బీజేపీ ఒక్క విభజన హామీని కూడా నెరవేర్చలేదని, తెలంగాణ ప్రయోజనం కోరకు కేంద్రం నుంచి ఏం తీసుకొచ్చారో చెప్పాలన్నారు. వీరి పాలన చూసిన ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు పట్టం కట్టారని తెలిపారు. దీంతో మనం ఏదో సాధించామని అలసి పోవద్దని, ఇక్కడ నియంత అయిన కేసీఆర్ ను గద్దె దించిన విధంగానే కేంద్రంలో బీజేపీని ఓడించేవరకు కష్టపడాలని సూచించారు. అనంతరం కార్యకర్తల ఎన్నికలైన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా విశ్రమించకుండా కాంగ్రెస్ గెలుపునకు కృషి చేయాలని కార్యకర్తలకు దిశానిర్ధేశం చేశారు.

Next Story

Most Viewed