తెలంగాణలో కాంగ్రెస్ ఎవరితో పొత్తు పెట్టుకోదు: తేల్చి చెప్పిన Manik Thakre

by Disha Web Desk 19 |
తెలంగాణలో కాంగ్రెస్ ఎవరితో పొత్తు పెట్టుకోదు: తేల్చి చెప్పిన Manik Thakre
X

దిశ, వెబ్‌డెస్క్: వచ్చే ఎన్నికల్లో హంగ్ తప్పదని.. బీఆర్ఎస్ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాల్సిందేనని టీ- కాంగ్రెస్ కీలక నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణిక్ థ్రాకే స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఎవరితో పొత్తు పెట్టుకోదని తేల్చి చెప్పారు. తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ఎవరితో పొత్తుపెట్టుకోదని అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పిన వ్యాఖ్యలకే నేతలంతా కట్టుబడి ఉన్నారని పేర్కొన్నారు.

పొత్తులపై చేసిన వ్యాఖ్యలను కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉపసంహరించుకున్నారని తెలిపారు. ఈ విషయంపై ఆయన నిన్న, ఇవాళ వివరణ ఇచ్చారని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ సింగిల్‌గానే పోటీ చేసి అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షులపై మాణిక్ థ్రాకే సీరియస్ అయ్యారు. కేటాయించిన జిల్లాలకు ఉపాధ్యక్షులు వెళ్లకపోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యక్షులు జిల్లాలకు వెళ్లకపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తామన్నారు. అంతేకాకుండా ఇవాళ గాంధీభవన్‌లో ఉపాధ్యక్షులతో థాక్రే నిర్వహించిన మీటింగ్‌కు 84 మందిలో 30 మందే హాజరు కావడంపై సీరియస్ అయ్యారు. ఈ సమావేశానికి రాని వారంతా వివరణ ఇవ్వాల్సిందేనని ఆయన ఆదేశించారు.

Also Read:

పొంగులేటిలో తగ్గిన జోష్... కారణం జగన్ వద్దని చెప్పాడా?

Next Story

Most Viewed