బీఆర్ఎస్ vs కాంగ్రెస్: రణరంగంగా మారిన రేవంత్ సభ

by Disha Web Desk 11 |
బీఆర్ఎస్ vs కాంగ్రెస్: రణరంగంగా మారిన రేవంత్ సభ
X

దిశ, కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో రాత్రి జరిగిన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్ ఉద్రిక్తత వాతావరణంలో జరిగింది. కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి గండ్ర సత్యనారాయణ రావు భూపాలపల్లి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పై చేసిన ఆరోపణలకు వేదికకు సమీపంలో గల ఎమ్మెల్యేకు చెందిన సినిమా థియేటర్ నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు సత్యనారాయణ రావుపై పెద్ద ఎత్తున కేకలు వేస్తూ నినాదాలు చేశారు. అదే స్థాయిలో కాంగ్రెస్ నాయకులు నినాదాలు చేస్తూ ముందుకెళ్లారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న సమయంలో థియేటర్ నుంచి కార్యకర్తలు ఒక్కసారిగా ముందుకు వచ్చి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తున్న చైతన్య రథంపై రాళ్లు, వాటర్ బాటిల్లు, చెప్పులు, కోడిగుడ్లు విసిరారు.

ఇరువురి పార్టీల కార్యకర్తలు రాళ్లు, బీరు సీసాలు, కోడిగుడ్లు పెద్ద ఎత్తున విసురుకున్నారు. ఈ దాడిల్లో పలువురికి గాయాలైనాయి. పోలీసులు జోక్యం చేసుకొని బీఆర్ఎస్ కు చెందిన కార్యకర్తలను థియేటర్ లోపలికి తీసుకెళ్లడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అప్పటికీ థియేటర్ బాల్కనీకి పైకి వెళ్లి కార్యకర్తలు వస్తువులను విసిరారు. కాంగ్రెస్ నాయకులు ప్రసంగిస్తున్నంతసేపు బీఆర్ఎస్ నాయకులు ఏదో విధంగా అల్లరి చేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అలజడి చేస్తున్న సమయంలో కాంగ్రెస్ కు చెందిన కార్యకర్తలు అటువైపు వెళ్లేందుకు పోలీసులతో వాదనకు దిగారు. భూపాలపల్లి డీఎస్పీ రాములు ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు.

Next Story

Most Viewed