పెద్దపల్లిలో కాంగ్రెస్‌ వెనుకంజ? మాదిగలంతా రివేంజ్‌కు సిద్ధం!.. తేల్చేసిన సర్వే

by Disha Web Desk 13 |
పెద్దపల్లిలో కాంగ్రెస్‌ వెనుకంజ? మాదిగలంతా రివేంజ్‌కు సిద్ధం!.. తేల్చేసిన సర్వే
X

దిశ, డైనమిక్ బ్యూరో : లోక్‌సభ ఎన్నికల నగారా మోగడంతో తెలంగాణలో రాజకీయం వేడెక్కుతోంది. ప్రధాన పార్టీలు నువ్వానేనా అన్నట్లుగా ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. అధికార కాంగ్రెస్ 14 స్థానాల్లో గెలవడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది. అయితే తాజాగా పెద్దపల్లి సెగ్మెంట్ విషయంలో సివిక్ పోల్స్ ఒపీనియన్ సర్వేలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మూడోస్థానానికి పరిమితం కాబోతున్నదని సివిక్ పోల్ సంస్థ అడ్మిన్ డి.మాధవి వెల్లడించారు. అలాగే నియోజకవర్గాల వారీగా పబ్లిక్ ఒపీనియన్ పరిశీలిస్తే గడ్డం వంశీకి నాన్న, పెద్దనాన్న ప్రాతినిథ్యం వహిస్తున్న అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ షాక్ తగలబోతున్నదని సర్వే తేల్చింది.

వంశీపై గుర్రుగా ఎమ్మెల్యేలు..

అభ్యర్థి ఎంపిక, ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలతో పెద్దపల్లిలో బీఆర్ఎస్, బీజేపీ మధ్య టఫ్ ఫైట్ నడవబోతున్నదని సర్వే అంచనా వేసింది. ఈ సెగ్మెంట్‌లో కాంగ్రెస్ అన్ని అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకున్నప్పటికీ గడ్డం కుటుంబంలో వివేక్, వినోద్‌లు ఇప్పటికే ఎమ్మెల్యేలుగా ఉండగా అదే కుటుంబానికి చెందిన గడ్డం వంశీకి ఎంపీ టికెట్ కేటాయించడంతోపాటు స్థానిక ఎమ్మెల్యేలకంటే వంశీ వయసు రీత్యా చిన్నవాడు కావడంతో అతని అభ్యర్థిత్వంపై గుర్రుగా ఉన్నారని, వెరసి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు షాక్ తప్పదని అంచనా వేసింది. అలాగే తమ సొంత నియోజకవర్గాల్లో ప్రజా సమస్యలను పరిష్కరించకుండా తమ కుమారుడి గెలుపు కోసం వివేక్ ఎమ్మెల్యేలను బుజ్జగించే పనిలో బిజీ అయ్యారనే సంకేతాలు ప్రజల్లోకి బలంగా వెళ్లడంతో ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తప్పదని సర్వే అంచనా వేసింది.

4 లక్షల మాదిగ సామాజిక వర్గం ఓట్లు..

పెద్దపల్లి లోక్ సభ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో కలిపి ఈ సర్వే కోసం 13,500 శాంపిల్స్ ద్వారా ప్రజాభిప్రాయాన్ని సేకరించారు. ఇందులో బీఆర్ఎస్‌కు 41.61 శాతం, బీజేపీకి 34.53 శాతం, కాంగ్రెస్‌కు 17.6 శాతం ఇతరులకు 0.63 శాతం, ఏమీ చెప్పలేమని మరో 5.54 శాతం మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే ఈ నియోజకవర్గంలో మాదిగ సామాజిక వర్గం ఓట్లు 4 లక్షలు ఉండగా గడ్డం ఫ్యామిలీకే ఎంపీ టికెట్ కేటాయించడంపై ఆ వర్గం గుర్రుగా ఉన్నట్లు తేలింది.

గెలుపు దిశలో బీఆర్ఎస్!

ఇక్కడ బీఆర్ఎస్ నుంచి మాల సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ బరిలో ఉండగా బీజేపీ నుంచి నేతకాని సామాజిక వర్గానికి చెందిన గోమాస శ్రీనివాస్ పోటీలో ఉన్నారు. ఈయన ఇటీవల కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. దీంతో తమకు టికెట్ దక్కలేదనే ఆగ్రహంతో ఉన్న మాదిగ సామాజిక వర్గం ఓట్లు కాంగ్రెస్‌పై కోపంతో భారీగా బీజేపీకి టర్న్ కాబోతున్నాయని సర్వేలో వెల్లడైంది. అలాగే ఇటీవల బీఎస్పీని వీడి బీఆర్ఎస్‌లో చేరిన దాసరి ఉషా ప్రభావం కూడా ఉండబోతున్నదని ఈ పరిణామాలు బీఆర్ఎస్‌కు అనుకూలంగా మారి ఆ పార్టీ గెలుపు దిశలో ఉండబోతున్నదని ఈ సర్వేలో తేలింది. లేకుంటే పెద్దపల్లి ఎంపీ స్థానం కాంగ్రెస్ సులువుగా గెలిచేదని తాజా పరిణామాలతో మూడో స్థానానికే పరిమితం కాబోతున్నదని అంచనా వేసింది.

చెన్నూరులో (వివేక్ సెగ్మెంట్)..

కాంగ్రెస్‌కు 16.41 శాతం

బీఆర్ఎస్‌కు 41.52 శాతం

బీజేపీకి 37.80 శాతం

బెల్లంపల్లిలో (వినోద్ సెగ్మెంట్)..

కాంగ్రెస్‌కు 11.67 శాతం

బీఆర్ఎస్‌కు 45.10 శాతం

బీజేపీకి 36.69 శాతం

ధర్మపురిలో

కాంగ్రెస్ 15.59 శాతం

బీఆర్ఎస్41.03 శాతం

బీజేపీ36.02 శాతం

రామగుండంలో

కాంగ్రెస్ 25.90 శాతం

బీఆర్ఎస్ 39.20 శాతం

బీజేపీ 29.27 శాతం

మంథనిలో..

కాంగ్రెస్14.97 శాతం

బీఆర్ఎస్43.83 శాతం

బీజేపీ34.13

మంచిర్యాలలో..

కాంగ్రెస్ 26.71శాతం

బీఆర్ఎస్ 36.29 శాతం

బీజేపీ 31.57 శాతం

పెద్దపల్లిలో..

కాంగ్రెస్ 14.45 శాతం

బీఆర్ఎస్43.10 శాతం

బీజేపీ 34.48 శాతం



Next Story