ఈటల మంత్రి ఉండగానే బియ్యం స్కాం..! కాంగ్రెస్ ఛార్జ్ షీట్‌లో సంచలన ఆరోపణలు

by Disha Web Desk 19 |
ఈటల మంత్రి ఉండగానే బియ్యం స్కాం..! కాంగ్రెస్ ఛార్జ్ షీట్‌లో సంచలన ఆరోపణలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ ఎమ్మెల్యేపై కాంగ్రెస్​ పార్టీ ఫస్ట్​టైమ్​ ఛార్జ్​షీట్​ రిలీజ్ ​చేసింది.మాజీ మంత్రి హుజూరాబాద్​ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌పై పార్టీ 9 అంశాలతో కూడిన ఛార్జ్​షీట్‌ను విడుదల చేసింది. దీనిలో ఆయన సివిల్​ సప్లై మినిస్టర్‌గా ఉన్నప్పుడు బియ్యం స్కామ్​ జరిగినట్లు ఆరోపిస్తూ ఛార్జ్​షీట్‌లో పొందుపరచడం గమనార్హం. బీఆర్‌ఎస్, బీజేపీలు ఒకటేనంటూ పేర్కొన్నది. చీకటి వ్యాపారాలు, ఒప్పందాలు కుదుర్చుకుంటూ బీఆర్ఎస్, బీజేపీలు ముందుకు సాగుతున్నాయన్నారు. ప్రజల కోసం ఈటల ఎలాంటి పోరాటాలు చేయలేదని కాంగ్రెస్ ​పార్టీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కేవలం వ్యక్తిగత స్వార్ధం కోసమే తపన పడుతూ ఈటల పార్టీ మారినట్లు తెలంగాణ కాంగ్రెస్​కమిటీ పేర్కొన్నది.

ఈటల ఛార్జ్​షీట్​లోని కాంగ్రెస్​పొందుపరిచిన అంశాలు ఇవే..

‘‘ఉప ఎన్నికల్లో తనకు మద్ధతివ్వని ఆసుపత్రి సిబ్బందిని ఎమ్మెల్యే ఈటల రాజేందర్​వేధింపులకు గురి చేసిండు. ఓ ఉద్యోగి మరణానికి కారణమైండు. వేరే పార్టీలకు మద్ధతిచ్చిన వారిని పోలీసులతో వేధిస్తుండు. అక్రమాలను ప్రశ్నించినందుకు నర్సింగాపూర్​ఎంపీటీసీని చంపించాడని ఆరోపణలున్నాయి. అందుకే గ్రామస్థులు కాన్వాయ్​ అడ్డుకొని ఊళ్లోకి రానివ్వలే.

హుజూరాబాద్​ చైర్​పర్సన్​ భర్త దగ్గరి నుంచి రూ. కోటి లంచం తీసుకొని ఛైర్​పర్సన్ ​సీటు కట్టబెట్టినట్లు ఆరోపణలున్నాయి. మంత్రిగా ఉన్నప్పుడు యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి తన పీఏ కరుణాకర్​సహాయంతో ఒక్కోక్క యువకుడి వద్ద నుంచి రూ. 5 లక్షలు వసూళ్లు చేసి మోసం చేసిండు. హుజూరాబాద్​ నియోజకవర్గంలోని అనేక మంది రైతులు మిర్చి పంట సాగు చేసి వర్షాలు, తెగుళ్లు కారణంగా తీవ్రంగా నష్టపోయినా పట్టించుకోలే. మంత్రిగా ఉన్నప్పుడు డబుల్​బెడ్రూం ఇండ్ల ఊసే ఎత్తలే. కేవలం పెద్ద మీటింగ్‌లు ఉంటేనే హుజూరాబాద్ ​వచ్చేటోడు. ఈటెలపై అనేక భూ దోపిడీ ఆరోపణలున్నాయి.

తుర్కయంజల్, కొంపల్లి ప్రాంతాలలో వందల ఎకరాలు ఆక్రమించిండు. దోచుకున్న డబ్బుతో ఒంటిమామిడిలో ఆర్వీఎం మెడికల్​కాలేజీ నిర్మించిండు. కెమికల్​ఫ్యాక్టరీ గుంజుకొని బీర్లు ఉత్పత్తి చేయిస్తుండు. కమాలాపూర్‌లో ఒకప్పుడు కేవలం రెండెకరాల భూమి ఉన్న రాజేందర్​ఇప్పుడు కోట్ల రూపాయలు విలువైన వందల ఎకరాలను ఆక్రమించిండు. అసైన్డ్, దేవాదాయ భూములను కూడా కొల్లగొట్టిండు. పౌర సరఫరాల మంత్రిగా ఉన్నప్పుడు రైసు మిల్లర్లను మోసం చేసిండన్న ఆరోపణలు వచ్చినాయి. బాధితులు ప్రెస్​మీట్‌లో ఈ విషయాలు వెల్లడించారు.

మంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ హాస్టళ్లకు పౌల్ట్రీ నుంచి అధిక ధరకు గుడ్లను సరఫరా చేసి రూ. కోట్లు దోచుకున్నడు. హుజూరాబాద్​నియోజకవర్గంలో ద్వితీయ క్యాడర్‌ని రాజకీయంగా ఈటల ఎదగనివ్వడంలే. మాజీ దళ కమాండర్​పోచమల్లుపై అక్రమ కేసులు బనాయింపజేసిండు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన గ్యాస్​ప్లాంట్, జాతీయ రహదారుల నిర్మాణ పనుల్లో భారీగా కమీషన్లు తీసుకున్నాడు” అంటూ కాంగ్రెస్​ పార్టీ ఈటలపై విడుదల చేసిన ఛార్జ్​షీట్‌లో హైలెట్​ చేస్తూ పొందుపరిచింది.

Next Story

Most Viewed