పోచారం చేరిక అవకాశవాదానికి నిదర్శనం.. కాంగ్రెస్ MLC జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Rajesh |
పోచారం చేరిక అవకాశవాదానికి నిదర్శనం.. కాంగ్రెస్ MLC జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇటీవల సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అయితే, పోచారం చేరికపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని అవకాశవాదానికి నిదర్శనంగా భావిస్తున్నా అన్నారు. ఇలాంటివి తాను ప్రోత్సహించనన్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయాలని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 65 మంది ఎమ్మెల్యేలతో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని.. ఇతర పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకోవాల్సిన అవసరం ఉందని తాను భావించడం లేదన్నారు. అయితే సొంత పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పార్టీలో చేరికలపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.Next Story

Most Viewed