విద్యుత్ కొనుగోళ్లపై చర్చకు రావాలి.. మాజీ ఎంపీ పొన్నం, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్​ కుమార్ గౌడ్

by Dishafeatures2 |
విద్యుత్ కొనుగోళ్లపై చర్చకు రావాలి.. మాజీ ఎంపీ పొన్నం, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్​ కుమార్ గౌడ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: విద్యుత్ కొనుగోళ్లపై చర్చకు రావాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్​ బీఆర్​ఎస్ పార్టీకి సవాల్ విసిరారు. విద్యుత్ అంశంలో అవినీతి జరుగుతుందని, ఈ మేరకు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాల్సిన అవసరం ఉన్నదన్నారు. కాంగ్రెస్ అంటేనే రైతులని, ఆ స్థాయిలో గతంలో భరోసా కల్పించామన్నారు. దేశంలో రైతులకు అనుకూలంగా పనిచేసిన పార్టీ కాంగ్రెస్ మాత్రమేనన్నారు. అయితే విద్యుత్ కొనుగోలులో జరిగిన అవినీతిపై రేవంత్ మాట్లాడితే వక్రీకరిస్తున్నారన్నారు. మంత్రులంతా ఊర కుక్కల్లా మాట్లాడుతున్నారన్నారు. కాంగ్రెస్ కు పెరుగుతున్న ఆదరణ చూసి బీఆర్ఎస్ లో వణుకు పుడుతోందన్నారు. రైతులకు 24 గంటల విద్యుత్ ఇవ్వటమే కాంగ్రెస్ ఎజెండా అని పేర్కొన్నారు. రైతులకు అన్ని పంటలకు మద్దతు ధర ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించిందన్నారు. రుణమాఫీ చేయని కేసీఆర్ సర్కార్ కు రైతుల గురించి మాట్లాడే నైతికత ఎక్కడిది అంటూ ప్రశ్నించారు.

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్​కుమార్​గౌడ్​ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి చెప్పిన విషయాలను వక్రీకరిస్తున్నారన్నారు. ఉచిత కరెంట్ విధానం స్టార్ట్ చేసినదే కాంగ్రెస్​ అని పేర్కొన్నారు.కిసాన్​ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి మాట్లాడుతూ.. మోడీ సర్కార్ తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలకు మద్దతు ఇచ్చిన కేసీఆర్ సర్కార్ కు.. రైతుల గురించి మాట్లాడే అర్హత ఎక్కడిది? అంటూ ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2 వేల సంవత్సరం లో విపరీతమైన విద్యుత్ సంక్షోభం ఉండేదని, ఏలూరు లో రైతులు కరెంట్ కోసం దీక్షలు చేస్తుంటే.. చంద్రబాబు ప్రభుత్వం కాల్పులు జరిపితే రైతులు తీవ్రంగా గాయపడ్డారని గుర్తు చేశారు.ఈ నేపథ్యంలోనే వైఎస్సార్ ఉచిత విద్యుత్ ను అమలు చేశారన్నారు.

Next Story

Most Viewed