కేటీఆర్.. నోరు అదుపులో పెట్టుకో.. ఇకపై చూస్తూ ఊరుకోం: నిరంజన్​

by Satheesh |
కేటీఆర్.. నోరు అదుపులో పెట్టుకో.. ఇకపై చూస్తూ ఊరుకోం: నిరంజన్​
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘‘కేటీఆర్​ ఏమైనా ఆజానుబాహుడా, మా అధ్యక్షుడిపై విమర్శలు చేస్తున్నాడు” అంటూ టీపీసీసీ వైస్ ​ప్రెసిడెంట్ నిరంజన్ ఫైర్ అయ్యారు. మంగళవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్​ నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. నోరు అదుపులోకి పెట్టుకోకపోతే ప్రజలు క్షమించరన్నారు. పదే పదే టీపీసీసీ అధ్యక్షుడిపై విమర్శలు చేస్తూ ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. కళ్లున్న కబోది కేటీఆర్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజాగా అమరులను బలి తీసుకున్నది సోనియా గాంధీ అని, ఆమె నిర్లక్ష్యంతో 300 మంది బలి అయినట్లు కేటీఆర్​ మాట్లాడటం సరికాదన్నారు. సోనియాపై చేసిన ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. సోనియామ్మ తప్పు చేసి ఉంటే, తెలంగాణ బిల్లు ఆమోదము పొందిన తర్వాత కుటుంబ సమేతంగా ఇంటికెళ్లి ధన్యవాదాలు ఎందుకు తెలిపారు..? అప్పుడు మీకు ఈ సోయి లేదా..? అంటూ నిరంజన్​ ఫైర్​ అయ్యారు. సీఎం పదవి దక్కదనే నిరాశతోనే కేటీఆర్ ​ఇలాంటి వ్యాఖ్యాలు చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed