బీసీల కోసం ఆలోచించే ఏకైక పార్టీ కాంగ్రెస్: Former MP Hanumantha Rao

by Satheesh |   ( Updated:2023-07-17 16:20:51.0  )
బీసీల కోసం ఆలోచించే ఏకైక పార్టీ కాంగ్రెస్:  Former MP Hanumantha Rao
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా బీసీ గర్జన సభలు నిర్వహిస్తామని మాజీ పీసీసీ అధ్యక్షుడు వి హనుమంతరావు పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అన్ని జిల్లాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తామన్నారు. రాహుల్ గాంధీ, సిద్ధ రామయ్యలను ఆహ్వనిస్తామన్నారు. ఈ నెల 19న మెదక్​జిల్లా సంగారెడ్డిలో, 21న కరీంనగర్, 23న నిజామాబాద్, 24న ఆదిలాబాద్‌లో సమావేశాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికే బీసీ జనగణన చేస్తామని రాహుల్ గాంధీ కూడా హామీ ఇచ్చారన్నారు. బీసీ ఛాంఫియన్స్​అని మోడీ, కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. బీసీ జనాభా ప్రకారం చట్టసభల్లో 50 శాతం స్థానాలు కేటాయించాలన్నారు.

బీసీల కోసం ఆలోచించే ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమే అని గుర్తు చేశారు. బీసీ పిల్లలు ఉన్నత చదువులు చదవడానికి కాంగ్రెస్ పార్టీ కారణం అన్నారు. రాజీవ్ గాంధీ 18 ఏళ్లకే ఓటు హక్కును కల్పించారన్నారు. బీసీ గర్జన ద్వారా బీసీ కులాలకు ఏం చేయాలనే దానిపై చర్చిస్తామన్నారు. ముస్లింలు అంతా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారన్నారు. అమిత్ షా ముస్లిం రిజర్వేషన్లు ఎత్తి వేస్తామంటే కేసీఆర్, కుమారస్వామి మాట్లాడలేదన్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీలు కాంగ్రెస్ పార్టీకి మద్ధతుగా నిలుస్తారన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్​మధ్యనే ఫైట్ఉంటుందన్నారు. బీజేపీ పని అయిపోయిందని, ఆ పార్టీ రిమోట్ నాగ్ పూర్‌లో ఉన్నదన్నారు.

Advertisement

Next Story